చేర్యాల ప్రజా సంకల్ప దీక్షను విజయవంతం చేయండి

చేర్యాల ప్రజా సంకల్ప దీక్షను విజయవంతం చేయండి

జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

చేర్యాల నవంబర్ 24 అక్షిత ప్రతినిధి: చేర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో, జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ అఖిలపక్ష నాయకులు హాజరై ఈనెల 30వ తారీఖు నాడు జరిగే రెవెన్యూ డివిజన్ గురించి సంకల్ప దీక్షకు మద్దతు తెలపాలని కోరారు. ముఖ్యంగా రెవెన్యూ డివిజన్ గురించి కొమ్మూరిప్రతాప్ రెడ్డి మూడు అంశాలు తెలియజేయడం జరిగింది.1. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని, 2. చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గం కావాలని, 3. నాలుగు మండలాలు జనగామ జిల్లాలో కలుపుకుంటూ చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరినారు,4.అసెంబ్లీ నియోజకవర్గం మరియు పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాలో ఉండాలని తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ డివిజన్ జేఏసీకి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నల్ల నాగుల శ్వేత, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్మా ఆగం రెడ్డి, చేర్యాల మండల అధ్యక్షులు కొమ్మురవి, పట్టణ అధ్యక్షులు మంచాల చిరంజీవులు, మాజీ జెడ్పిటిసి కొమ్ము నర్సింగరావు, దాసరి శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంజ మల్లేశం, కౌన్సిలర్స్ ముస్ట్యాల తార యాదగిరి, ఆడెపు నరేందర్, చెవిటి లింగం, నాయకులు తడక లింగం, తాళ్లపల్లి రమేష్, అవుసెర్ల యాదయ్య, ఎండి కాజా, వెలగల దుర్గయ్య, యూత్ కాంగ్రెస్ కర్క సంతోష్ రెడ్డి, సోషల్ మీడియా అందే నాని, ఎండి జారుద్దీన్, బుడిగ రమేష్, బండి శ్రీనివాస్, బుట్టి బిక్షపతి, మరియు జిల్లా మహిళా కార్యదర్శి తొల్ల రాజేశ్వరి, పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు వంగ జయలక్ష్మి, రేగులపల్లి విజయ, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking