*సర్వే డేటా ఎంట్రీ కీలకమైనది
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు…!*
*డోర్ లాక్, వలస వెళ్ళిన వారి వివరాలు ఫోన్ కాల్ ద్వారా సేకరించాలి…!!*
*సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి…!!!*
జనగామ, అక్షిత ప్రతినిధి:
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
ఆదివారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జార్ఖండ్ రాజధాని రాంచి నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా *ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ,* సర్వే డేటా ఎంట్రీ లో నాణ్యత చాలా ముఖ్యమైందని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తేయి కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమ బద్ధకరించుకోవాలని, వారిని అందుబాటులో ఉండమని కోరాలని ఆదేశించారు.గ్రామీణ ప్రాంతాల్లో వలసలు మొదలైన వారి వివరాలను జాగ్రత్తగా క్రమబద్దరీకరించుకోవాలని తెలిపారు.
కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని, ఈ పాఠశాలలో ఆహారం, పరిశుభ్రత పై ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ ప్రత్యేక దృష్టి పెట్టిందని , అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తలెత్తకూడదనే మెస్, కాస్మోటిక్స్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ సీఎం తెలిపారు.ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.ఈ వీసీలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ…. జనగాం జిల్లాకు సంబందించి.. హౌస్ లిస్టింగ్ ప్రకారం సర్వే పూర్తి అయ్యిందని…ఇంకనూ ఎవరైనా తమ కుటుంబ వివరాలు ఇవ్వాలిసి ఉంటే.. గ్రామం లో అయితే పంచాయతీ సెక్రటరీ కి అలాగే మున్సిపల్ అయితే..వార్డు ఆఫీసర్ కి గాని…76739 71836, 84668 51968, 99481 87334 ఈ మూడు ఫోన్ నెంబర్ లకి ఫోన్ చేసి అయినా వివరాలను రెండు రోజుల్లో ఇవ్వలిసింది గా క్షేత్ర స్థాయి అధికారుల ద్వారా… ప్రజలకు తెలియజేయడం జరిగిందని తెలిపారు.
అలాగే డేటా ఎంట్రీ గురించి మాట్లాడుతూ …. సేకరించిన సర్వే వివరాలను పక్కాగా ఆన్లైన్ లో నమోదు చేసేందుకు సరిపడా డేటా ఎంట్రీ ఆపరేటర్ లను తీసుకోవడం జరిగిందని…. జిల్లా, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లో సర్వే వివరాలు పక్కాగా నమోదు అయ్యేలా తగు ఆదేశాలు ఇచ్చమాన్నారు.
ప్రభుత్వ స్కూల్ లలో,హాస్టల్ లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు…. జిల్లా, మండల స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీ లు చేసి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందుతుందా .. లేదా అనే అంశం పైన నివేదికలను తెప్పించుకున్నట్లుగా కలెక్టర్ వివరించారు.
జిల్లా లో ఉన్న అన్ని హాస్టల్ లో… పాఠశాలలో విద్య తో పాటు విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందేలా తగు జాగ్రత్త లు తీసుకుంటామన్నారు.