ఖమ్మంలో ఘనంగా కుమ్మరుల వన మహోత్సవం
–కుమ్మరుల వనమహోత్స వంలో మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురామిరెడ్డి
ఖమ్మం /అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరం బల్లేపల్లిలో జగన్ వారి మామిడితోటలో మొల్లమాంబ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రెవెన్యూ గృహనిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రజలందరీ సహకరంతోనే తాను ఉన్నతస్థాయికి ఎదుగుతున్నట్లు పేర్కొన్నారు.ప్రజల ఆశీస్సులు దీవెనలతోనే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అన్ని వర్గాల లాగానే కుమ్మర కులస్తులు కూడా ఏకతాటిపై నిలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు.
కుమ్మరుల న్యాయపరమైన సమస్యలన్నింటినీ పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ రఘురాం రెడ్డి కూడా మంత్రి వెంట ఉన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ వనజీవి రామయ్య కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొగిలిచర్ల సైదులు దరిపల్లి చంద్రశేఖర్ గౌరవ అధ్యక్షులు సిలువేరు జనార్ధన్ నాయకులు కోరంపల్లి శ్రీనివాస రావు చలిగంటి బిక్షమయ్య దరిపల్లి వీరబాబు చలిగంటి శ్రీనివాసరావు మల్లాల రాధాకృష్ణ ఖమ్మంపాటి రమేష్ దునుకు వేలాద్రి, తిగుళ్ళ వెంకటరమణ రాజు సరవయ్య మహేష్ చందు హరీష్ శంకర్ వెంకటేశ్వర్లు వీరబాబు శ్రీకాంత్ శ్రీనివాసరావు వెంకటరమణ వెంకట నారాయణ వెంకటేశ్వరరావు బుచ్చి రాములు చంటి వెంకటేశ్వర్లు వీరా శేఖర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.