దుండిగల్ లో మర్రి లక్ష్మారెడ్డి సంస్థలో..
కేఎల్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్న రుకైయా బేగం..
మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ పురపాలక పరిధి దుండిగల్ లో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ అధ్యపకురాలు రుకైయా బేగం కేఎల్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఈ.ఎల్. టీ లో తాను చేసిన ప్రత్యేకమైన పరిశోధనకు ఈ యొక్క డాక్టరేటు డిగ్రీ ప్రధానం చేయడం జరిగిందని ఆమె అన్నారు. ఈమె రాసిన ఐదు పరిశోధనా వ్యాసాలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌చే గుర్తించబడిన అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.ఈ సంద్భంగా ఆమె మాట్లడుతూ తనకు సహకరించిన కళాశాల యాజమాన్యం వారికి మరియు కుటుంబ సభ్యులకు ముఖ్యంగా తన యొక్క తల్లి తండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఒక మధ్య తరగతి మహిళగా ఎన్నో ఓడి డుకులను ఎదురుకుని, చిన్న వయసు లోనే వివాహం చేసుకున్న, ఎంతో ఓర్పుసహనంతో, రాజీ పడకుండా చదువుకున్న అని , తన తల్లి తండ్రులకు యెుక్క కళలను కష్టపడి నెరవేర్చనని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో పరిశోధనలు చేసి టీచింగ్ లో ఎన్నో ఆధునిక బోధన విధానాలను తీసుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ యొక్క డాక్టరేటు డిగ్రీ దక్కినందుకు ఆనందంగా ఉందని అన్నారు…