సేవల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ అంబాసిడర్స్

ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 5 టోర్నమెంట్ క్రీడలు ప్రారంభం

ఎమ్మెల్యే వేముల వీరేశం
●ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ, అక్షిత బ్యూరో :

నల్గొండ పట్టణంలోని N.G కళాశాల మైదానంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్గొండ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్-5 ను ప్రారంభించిన
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ ఆర్ ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పేద నిరుపేద కుటుంబంలో చదువుకోవాలని ఉన్నప్పటికీ వాళ్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేని విద్యార్థులకు సహాయం చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక అంబాసిడర్ గా నిలుస్తారన్నారు. ముందుంటారు అని తెలిపారు జిల్లా అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తనయుడు ప్రతీక్ రెడ్డిని కోల్పోయిన తర్వాత ఎంతోమంది పేద బీద విద్యార్థులకు సహాకారం అందిస్తూ వారిలో తన కుమారుని చూసుకుంటాడని ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుండే మహోన్నతమైన వ్యక్తులు అని కోమటిరెడ్డి బ్రదర్స్ ని కొనియాడారు.

విద్యార్థులకు విద్యారంగంలో క్రీడాకారులకు క్రీడ రంగంలో ప్రోత్సహిస్తూ ఉండటంలో వారికి వారే నిదర్శనం అన్నారు ఎంబిబిఎస్ లాంటి పెద్ద పెద్ద చదువుల కైన ఆర్థిక సాయం చేసి విద్యార్థుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు ఈ కార్యక్రమంలో నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking