మహనీయుల విగ్రహాల గోడపత్రిక- కరపత్రాలు ఆవిష్కరణ
– కౌన్సిలర్ కొంగరి కృష్ణ- మాజీ సర్పంచ్ దారెడ్డి మల్లారెడ్డి
భూదాన్ పోచంపల్లి,అక్షిత ప్రతినిధి :
మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ లో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న జ్యోతిభా పూలే, డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్, పోచంపల్లి మాజీ జడ్పీటీసీ స్వర్గీయ కొంగరి భాస్కర్ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ గోడపత్రిక- కరపత్రాలను కౌన్సిలర్ కొంగరి కృష్ణ మాజీ సర్పంచ్ దారెడ్డి మల్లారెడ్డి గ్రామ పెద్దల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీన మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మునుకుంట్ల భానుచంద్రం గౌడ్, కొండమడుగు ఎల్లమ్మ మైసయ్య, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ కన్వీనర్ కొండమడుగు రాజు, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ చైర్మన్ కొండమడుగు ఎల్లస్వామి, చెన్నకేషవ దేవస్థానం మాజీ ఛైర్మన్ నక్కల రాజిరెడ్డి, ఇట్టమోని నరేందర్, కొండమడుగు భీమయ్య, సప్పిడి చంద్రశేఖర్, జక్కలి ఐలయ్య, కారింగ్ శ్రీను, అరుణోదయ సంఘం అధ్యక్షుడు మీసాల శ్రీను, కొండమడుగు మల్లయ్య, రామేశ్వర్, రోషన్, పవర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కొండమడుగు పాండు, కోశాధికారి పెరుమాండ్ల అశోక్, మల్లేశం, స్వామి, భాస్కర్, శ్రీకాంత్, పోతగాళ్ల తరుణ్, భాను సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.