ప్రజా పాలన విజయోత్సవాలు
●ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్గొండ అక్షిత బ్యూరో
నకిరేకల్ పట్టణ కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన ఉత్సవాలో భాగంగా మొదటి రోజు విద్య దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండి విజయాన్ని సాధించాలన్నారు ఈరోజు ఏర్పాటుచేసిన వ్యాసరచన పోటీల్లో ఎవరైతే గెలుపొందారో వారందరిని అభినందించారు ఓడినవారు నిరుత్సాహపడోద్దని తెలిపారు విద్యార్థిని విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండి పాఠశాల పేరును నిలబెట్టాలని కొనియాడారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్, మండల విద్యాధికారి నాగయ్య,పన్నల రాఘవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు గాజుల సుకన్య, సైదులు తదితరులు పాల్గొన్నారు