ఖమ్మంలో ఘనంగా రజక వనమహోత్సవం

ఖమ్మంలో ఘనంగా రజక వనమహోత్సవం

వేలాదిగా తరలి వచ్చిన రజకులు

-ఐకమత్యంతో ముందుకు సాగుదాం

మాజీ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య , జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారిని గుడికందుల జ్యోతి,
తుపాకుల ఎలగొండ స్వామి ,పంతంగి వెంకటేశ్వర్లు

ఖమ్మం/అక్షిత బ్యూరో :

ఖమ్మంలోని గొల్లగూడెం చెరుకూరి తోటలో ఆదివారం రజక సంఘం ఆధ్వర్యంలో రజకవన సమారాధన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. తొలుత రజకుల ఆరాధ్యదైవం మాడెలయ్య స్వామీకి పూజలు చేశారు. అనంతరం పోరాటాయోధురాలు చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఈ వనసమారాధన కార్యక్రమంలో 10 వేలమంది రజకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడుతూ రజకులు సామాజికాంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ఆయన అన్నారు. రజకుల కోసం ఖమ్మంలో భవనం ఏర్పాటు చేసుకోవాలని దాని సంబంధించి తాను సహకరిస్తానని తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు నిధులతో భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలని తాను అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు.

జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు జ్యోతి మాట్లాడుతూ రజకులు అంటేనే వెనకబడిన జాతీ అని అన్నారు. సమాజంలో ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ప్రాధాన్యతుందో అదే ప్రాథమిక తమకి కూడా ఉందని ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ ఉందని మనకు సంబంధించి ఎటువంటి చట్టాలు లేవని అన్నారు చాకలమ్మ రాలేదా అని అన్న కూడా మనం తలదించుకొని వెళ్తున్నామని అలాంటి పేర్లతో ఎందుకు పిలుస్తున్నారని అనలేకపోతున్నామని పెద్దలందరూ గమనించి ఇటీవల ఖమ్మం వచ్చిన బీసీ కమిషన్కు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు ఐక్యంగా ఉండాలని సమాజంలో రజకులను వివక్షకు గాని వెలివేతగాని గురి చేస్తే అందరం సంఘటనంగా ఎదుర్కోవాలని అన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కునికి పుచ్చుకొని ఎప్పటికీ కూడా పోరాట స్ఫూర్తి రావడంలేదని ఆమె ముసలితనంలో కూడా పోరాటస్ఫూర్తిని కనబరిచిందని మనం అందరం కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మన జాతి కోసం
పోరాడాలని అన్నారు. మనలో ఐక్యత లేదని కనిపిస్తుంది దయచేసి అందరం ఐక్యంగా ఉండాలని కోరారు మన వెనుకబాడుతనానికి ప్రధానమైన కారణం చదవని అందరం చదువుకోవాలని అన్నారు. చదువుకుంటేనే ఆర్థికంగా కూడా నిలవగలమని అన్నారు. రాజకీయంగా కూడా తాము వెనకబడి ఉన్నామని కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు కూడా చదువుకునే విధంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం అందించే పథకాలను సంయోగం చేసుకొని ఐక్యంగా ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వం బీసీలకు గురుకుల ఏర్పాటు చేసిందని గురుకులాల్లో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఇప్పటికైనా అందరూ ఐక్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రజక సంఘం నాయకులు ముదిగొండ సోసైటీ చైర్మన్ తుపాకుల ఎలగొండ స్వామి మాట్లాడుతూ రజకులు ఐకమత్యం తో ముందుకు సాగాలని ఆయన అన్నారు. రజక సంఘం నాయకులు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంతంగి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని రజకుటం మాతో నా కృత కుటుంబాలు వ్యాపార కుటుంబాలు ఉద్యోగ కుటుంబాలు అన్ని కూడా ఒక వేదికపై జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మనం ఇంకా రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నిర్వహణ కమిటీని అభినందించారు. రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో రజకుల కార్తీక వన సమారాధన గౌరవ సలహాదారులు తంగెళ్ళపల్లి శ్రీనివాస్ కమిటీ జిల్లా అధ్యక్షులు కణతాల నరసింహారావు జిల్లా ప్రధాన కార్యదర్శి కండ్రాతి వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు పంతంగి రవికుమార్ వట్టి కోట దర్గయ్య మణిగ కోటేశ్వరరావు చట్టు మంగ రేగముడి రామకృష్ణ కొత్తపల్లి పుష్ప కొలిపాక వెంకట్ గుడి కందుల వెంకన్న పగిళ్ల బుచ్చిబాబు కొండపల్లి రాంబాబు తుపాకుల మధు సుంకేసుల వెంకటేశ్వర్లు నేరెళ్ల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking