పట్టభద్రుల ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ రాక ముందే
జోరుగా ప్రచారం చేస్తున్న మాజీ డీఎస్పీ గంగాధర్
– ఒకే రోజు హుజురాబాద్, జమ్మికుంట, కామారెడ్డిలలో ప్రచారం
కామారెడ్డి, అక్షిత ప్రతినిధి :
కరీంనగర్ నియోజక వర్గ పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న, మాజీ డీఎస్పీ మధనం గంగాధర్ తన ఎన్నికల ప్రచారాన్ని తీవ్రం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా ఎన్నికల కమీషన్ ప్రకటించక పోయినప్పటికీ గంగాధర్ విసృతంగా పర్యటిస్తూ తమకు ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదివారం హుజురాబాద్, జమ్మికుంట, కామారెడ్డిలలో పట్టభద్రులతో గంగాధర్ సమావేశమై చర్చించారు.

వాళ్లతో టీ తాగుతూ ఆయన ముచ్చటించారు. తాను డీఎస్పీ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు గంగాధర్. అట్టడుగు వర్గీయులకు శాసన మండలిలో, శాసన సభలో స్థానం లేదన్నారు ఆయన. మన ఓట్లు.. వాళ్లకు సీట్లా అంటూ వాకర్స్ తో చర్చించారు. అలాగే క్రీఢకారులతో గంగాధర్ ముచ్చటించారు. వాళ్లతో కొంతసేపు ఆయన ఆడారు.

తాను చదువుతో పాటు క్రీఢలలో ముందుండటం వల్లే తాను సక్సెస్ అయ్యానని చెప్పారు గంగాధర్. అయితే.. మన వారితో పట్టభద్రులు ఓటరు కోసం దరఖాస్తులు చేసుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్, జమ్మికుంట, కామారెడ్డిలలో గంగాధర్ కు భారీ స్పందన ఏర్పడింది. ఈ సందర్భంగా గంగాధర్ ను విద్యావంతులు సన్మానించారు.