ఓటర్ మనస్తత్వం మార్చడానికి గురువులు కృషి చేయాలి
: పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి , మాజీ డీఎస్పీ గంగాధర్
కామారెడ్డి, అక్షిత ప్రతినిధి :
నిజాయితీగా ఓటేసి… నిబద్ధతను చాటుదాం. మన ఓట్లు… సీట్లు వాళ్ళకా… నికార్సయిన వ్యక్తిత్వం… బడుగుల ఆత్మగౌరవాన్ని చాటేందుకు అత్యున్నత స్థాయి ఉద్యోగాన్ని పణంగా పెట్టి .. పట్టభద్రుల ఎన్నికల సమరంలోకి దిగిన మాజీ డీీఎస్పీ మదనం గంగాధర్ కు ఓట్టేద్దాం. పేదల గొంతుకకు అండగా నిలుద్దాం.ఓటర్ మనస్తత్వం మార్చడానికి గురువులు కృషి చేయాలని కరీం నగర్ పట్ట భద్రుల నియోజక వర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి , మాజీ డీఎస్పీ గంగాధర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఎస్సీ, ఎస్టీ ఉపాద్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో ఐదు వందల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ సమాజంలో మార్పును తెచ్చే సత్తా ఒక ఉపాధ్యాయులకే ఉందన్నారు.
కమర్షియల్ గా మారిన ఎన్నికలలో మేధావులు పోటీ చేయడానికి భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పవిత్రమైన ఓటును నిజాయితీగా వేయడానికి ఉపాద్యాయులు కృషి చేయాలని గంగాధర్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కు వెంకయ్య, ఎంపీ సురేష్ షత్కర్, మాజీ డీఎస్పీ మధనం గంగాధర్, మాన కొండూరు మాజీ ఎమ్మెల్యే మోహన్ రావు లను సన్మానించారు.
ఎస్సీ, ఎస్టీ ఉపాద్యాయ సంఘం అధ్యక్షుడు కొంగల వెంకట్, ప్రధాన కార్యదర్శి చౌహాన్ శుభాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.