పేకాటరాయుళ్ళ అరెస్ట్ : ఎస్సై కృష్ణయ్య

పేకాటరాయుళ్ళ అరెస్ట్ : ఎస్సై కృష్ణయ్య

మాడుగులపల్లి, అక్షిత ప్రతినిధి :

మండల పరిధిలోని చెరువుపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై ఎస్సై కృష్ణయ్య పోలీస్ సిబ్బందితో చాకచక్యంగా పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. అట్టి వారి నుండి రూ. 7400/-, 03 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

పేకాట ఆడిన కుక్కల రమేష్, చెరుకుపల్లి సైదులు, గంటకంపు రామకృష్ణ, రాములు,నవీన్, చంటి, బోల్లం పెద్దిరాజు, బుర్రి పాపిరెడ్డి వీరిలో కొందరు పట్టు పడగా మరికొందరు పరారైనారు అని ఎస్సై కృష్ణయ్య తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking