*రక్త దానం చేయండి.. ప్రాణదాతలు కండి..*
*అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న*
*కీ,,శే,, కన్నెబోయిన నవీన్ ( గురు ) యాదవ్ జ్ఞాపకార్ధంగా కక్కిరేణిలో రక్తదాన శిబిరం.*
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో సోమవారం గ్రామానికి చెందిన యువకుడు కీ,,శే,, కన్నేబోయిన నవీన్ (గురు)యాదవ్ జ్ఞాపకార్ధంగా ఎర్రగడ్డ సెంటర్ లో గురు యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. భారతదేశంలో 10% కొరతను ఎదుర్కొంటోంది. దాన్ని అధిగమించేందుకు రక్తాన్ని కృత్రిమంగా సృష్టించలేమని అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానమని రక్త కొరత ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువ భాగం తల సేమియా వ్యాధిగ్రస్తులుగా గురవుతున్నారని వారిని కాపాడుకునేందుకు గ్రామంలోని యువకులు రక్తం ఇవ్వడానికి 30మంది ముందుకు రావడం అభినందినీయమని పలువురు తెలిపారు.రక్తదానం చేయడం వల్ల హార్ట్ స్ట్రోక్ , కొలెస్ట్రాల్ , బిపి , షుగర్ అదుపులో ఉంటాయని అందుకోసమే ప్రతి ఒక్కరూ రక్త శుద్ధి కోసం రక్తదానం చేయాలని అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అనే స్ఫూర్తితో గ్రామాలల్లో యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానంపై చైతన్య కార్యక్రమాలు చెయ్యాలని కోరారు..ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కన్నెబోయిన జగన్ , పిట్ట రామిరెడ్డి , మాడురి సోమేశ్వరరావు , వేముల సైదులు , దయాకర్, అనిల్, బోడ సైదులు , గురు యువసేన సభ్యులు మాండ్ర విష్ణు , పాపని జయప్రకాష్ , గుండెపూరి విష్ణు , బాసాని మహేష్ ,మర్రి నరేష్ , కృష్ణ ,కన్నేబోయిన రాకేశ్ ,విష్ణు , నవీన్ ,శివకుమార్ ,నవీన్, సాగర్ల , రమేష్ , చింతల నరేందర్ , రంజిత్ , తదితరులు పాల్గొన్నారు…