కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి, శిల్పులు, అందరూ విశ్వబ్రాహ్మణులే
విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి
సీనియర్ అడ్వకెట్ పెందోట శ్రీనివాస్ వేసిన పిటీషన్ పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు
హర్షం వ్యక్తం చేసిన స్వర్ణకార సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కన్నెకంటి వెంకటేశ్వరాచారి
రామన్నపేట అక్షిత ప్రతినిధి
వృత్తిపరంగా కాకుండా కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి, శిల్పులు, అందరు విశ్వబ్రాహ్మణులే అని పరిగణించాలని పేర్కొంటూ ప్రభుత్వం రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లకు జీవో జారీ చేయడం స్వాగతీయమని విశ్వబ్రాహ్మణ సంఘం, స్వర్ణకార సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కన్నెకంటి వెంకటే శ్వరచారి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ అడ్వకెట్ పెందోట శ్రీనివాస్ వేసిన పిటీషన్పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వేలో విశ్వబ్రాహ్మణ కులం కాకుండా వృత్తి పరంగా వేర్వేరు కులాలను చేర్చి సర్వేచేయడంపై రాష్ట్ర హైకోర్టు స్పష్టత నిచ్చిందన్నారు. రాష్ట్రంలో బీసీ కులాలను వర్గీకరించిన జీ.ఓ. లో వృత్తులైన కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి, శిల్పి లను విశ్వబ్రాహ్మణ కులంగా పేర్కొంటూ స్పష్టంగా తెలిపిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సమగ్ర కుటుంబ సర్వే లోని ఫారాలలో విశ్వ బ్రాహ్మణ కులం కాకుండా వృత్తులను అనుసరించి కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి, శిల్పి లను వేర్వేరు కులాలుగా పేర్కొందన్నారు. దీనితో, వేర్వేరు కులాలుగా పేర్కొనడం పట్ల విశ్వ బ్రాహ్మణ సంఖ్య తగ్గి రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలలో తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర హై-కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వుల పట్ల సీనియర్ అడ్వకేట్ పెందోట శ్రీనివాస్, విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ వికాసానికి తోడ్పాటునందించిన విశ్వబ్రాహ్మణ తెలంగాణ లీగల్ సెల్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కానోజు శ్రీనివాసాచారి, ఆకవరం శ్రీనివాసచారి, చోల్లేటి చంద్రశేఖరాచారి, కాస్ట్రోజు పాండురంగాచారి, కన్నెకంటి ప్రభాకరా చారి, మారోజు రాఘవాచారి, పిన్నోజు వెంకటేశ్వర్లు చారి, కూరెళ్ల బిక్షమాచారి, పిన్నోజు ఉపేందర్ చారి, ఖాన్డోజు వెంకటాచారి, ఆ కవరపు ఉదయాచారి, కాన్జోజు సైదుల్ చారి, కొల్లోజు నరేష్చరి, శుభకోటి శ్రీకాంతాచారి, అక్కినపల్లి ఉపేంద్రాచారి, కూరెళ్ళ రామకృష్ణాచారి, గిన్నెల సాయికుమార్చారి తదితరులు పాల్గొన్నారు.