ఇవే మా నివాళులు…..
నంగునూర్, అక్షిత ప్రతినిధి:
నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వర్ధంతి నిర్వహిస్తూ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి ఆయన రాసిన రాజ్యాంగం 100 శాతం అమలు కావాలంటే ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు చిట్యాల తిరుపతి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత దేశం లోని బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం చేసిన త్యాగాలు మరువరానివి ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు మనల్ని ఇంత స్థాయికి తీసుకొస్తున్నాయి. ఆయన రాజ్యాంగం రాయకుంటే ఈరోజు మన బతుకులు ఇలా ఉండేటివి కావు అని గుర్తు చేశారు. అంబేద్కర్ రచించిన పుస్తకాలు తప్పకుండా చదువలని, ఆయన ఆశయాలను,కళలు కన్నా రాజ్యం ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడే నిజమైన ఆయనకు ఘన నివాళ్లు చెప్పిన వారము అవుతామని మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ సంఘం ఉపాధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ గంధమల కుమారు ప్రధానకార్యదర్శి పుర్ర రాజు,కార్యదర్శి గంధమల్ల సుధాకర్, క్యాషియర్ పుర్ర లింగం, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు, సంఘం మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు వివిధ పార్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, మాజీ సర్పంచ్ లు, మరియు స్కూల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post