తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి పాలన
ఖమ్మం /అక్షిత బ్యూరో :
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి పాలన ఉన్నదని ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు.ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై రాష్ట్రంలో చేపడుతున్న కక్ష సాధింపు చేశారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం తరఫున ఘన నివాళులు అర్పించారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సుందరీకరణ చేసేందుకు ప్రజా సందర్శనకు నోచుకోకుండా ప్రభుత్వం ఎందుకు రాజకీయం చేస్తుందన్నారు.అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తే కేసిఆర్ పాలనలో దళితులకు జరిగిన సంక్షేమం గుర్తుకొస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..?*నాడు ప్రతిపక్షంలో ప్రశ్నించే గొంతుకను అవుతాను అని నేడు అధికారం రాగానే ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అణచి వేస్తున్న రేవంత్ రెడ్డి.బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు పోలీస్ స్టేషన్లు కేసులు కొత్తేమీ కాదు ప్రభుత్వ బెదిరింపులకు భయపడతారు అనుకోవడం అవివేకమే అని అన్నారు.రాష్ట్రంలో పోలీసు వ్యవస్థతో రాజ్యమేలాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకోకపోతే ప్రజా క్షేత్రంలో మరింత చులకన అవుతారాని అన్నారు.ఈనెల 9వ తేదీ నుండి జరిగే శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీ శాసన సభ వేదికగా ప్రజా సమస్యలను గొంతెత్తుతామని తెలిపారు.ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలందరినీ ఆశ్చర్యపరిచింది.కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక ప్రతిపక్ష నాయకులపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడే భాష తీరు కు ప్రజలు చి కొడుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చి అబద్దాలు చెప్పుతున్నాడు చివరికి దేవుళ్లను కూడా మోసం చేస్తున్నాడు.రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం 420 హామీలతో ఆరు గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఆశ చూపించి రైతులను పేదవారిని విద్యార్థులను మోసం చేశారు.
రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో నెలకొన్న దుర్భురమైన పరిస్థితిలకు ముమ్మాటికి రేవంత్ రెడ్డి కారణమన్నారు.గురుకుల పాఠశాలలో చదివే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం ఘనత సాధించారని ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు.తెలంగాణ తల్లి విగ్రహం పై కూడా రాజకీయాలు చేస్తుండడం సిగ్గుచేటు నేడు అధికారం ఉంది కదా అని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చవచ్చు తెలంగాణ బిడ్డల మనసుల్లో నాటుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు చెరపగలుగుతారు ? అని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సుపరిపాలనను మరియు కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేసేందుకు చేసే ప్రయత్నాలు విఫల ప్రయత్నాలు గానే ఉంటాయి.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందుకు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విషయాలపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు.త్వరలో రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పక మానరు.దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రతిపక్ష నాయకులను అణిచివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రాలను న్యాయస్థానాల వేదికగా ఎదుర్కొంటామన్నారు.ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో ప్రజా సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతులను అణిచివేయడం కాంగ్రెస్ ప్రభుత్వం తరం కాదన్నారు.ఈ మీడియా సమావేశంలో మాజీ రాష్ట్ర విత్తనాభివృద్ధి చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం ఖమ్మం రూరల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఖమ్మం నగరపార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ శీలంశెట్టి వీరభద్రం డేరంగుల బ్రహ్మం ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు పగడాల నరేందర్ గుండ్లపల్లి శేషగిరి రావు లింగనబోయిన సతీష్ మహర్షి నాయకులు సద్దాం షేక్ బలుసు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.