సీఎం సహాయనిది పేదలకు గొప్పవరం
టిపిసిసి కోఆప్షన్ సభ్యులు గాలి బాలాజీ
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:
కేపీ హెచ్ బి కాలనీ కి చెందిన కాకర భవిష్ తేజ్ కు ఇటీవల ఆపరేషన్ జరుగగా ముఖ్యమంత్రి సహాయానిది నుండి సహాయం కోరగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు దృష్టి కి తీసుకువెళ్లగా వారి సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయానిది నుండి కేటాయించటం జరిగింది. ఆ చెక్కును ఆదివారం కూకట్ పల్లి కాంగ్రేస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో టెంపుల్ బస్టాప్ వద్ద వారికి అందచేయటం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో టి పి సి సి కార్యదర్శి, కో ఆప్షన్ సభ్యులు గాలి బాలాజీ, యువజన కాంగ్రేస్ నాయకులు రాజేష్ గౌడ్, మైనార్టీ నాయకులు ముఖ్ధూమ్, రేవంతన్న సైన్యం పి అర్ నాయుడు, లడ్డు సాయి, యువజన కాంగ్రెస్ 114 వైస్ ప్రెసిడెంట్ భార్గవ్, షకీల్, రమణ కాకర,సాయి లు పాల్గున్నారు. పేదవాళ్ళు ఎవరైనా వైద్య సహాయంకొరకు ఇబ్బందులు పడకుండా స్థానిక కాంగ్రేస్ నాయకులను సంప్రదించాలని కోరారు.