చెస్ లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
*ఎమ్మెల్యే బిఎల్ఆర్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
చెస్ క్రీడాకారులు రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి మిర్యాలగూడ పట్టణానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ కోరారు. మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెం ఐఎంఎ భవనంలో డైమండ్ చెస్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ -19 ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ ప్రారంభించి ఎమ్మెల్యే బిఎల్ఆర్ నిర్వాహకులతో కలసి చెస్ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలు చెస్ క్రీడలు ఆడటం వలన పిల్లల మేధస్సు మెరుగుపడటంతో పాటు మానసికంగా బలంగా తయారవుతారన్నారు
చెస్ క్రీడలు నిత్యం ఆడటం వలన చదరంగంలోని ఆటుపోట్లనే కాదు జీవితంలో వచ్చే ఆటుపోట్లను కూడా తట్టుకునేలా ప్రణాళికలు రూపొందించే మేధస్సు కూడా పెంపొందుతుందని అన్నారు.

ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎం కప్ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారని అన్నారు.
పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లితండ్రులను అభినందించారు. నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 80 మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొన్నారు. పెరుగుతుందన్నారు. భోజన వసతిని వ్యాపారవేత్త కిరాణా రాజేందర్ కల్పించారు.
కార్యక్రమంలో డైమండ్ మాశెట్టి గీత అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి అంకితగౌడ్, అరవింద్, లక్ష్మీప్రియ, కౌన్సిలర్ గంధం రామకృష్ణ, కాంగ్రెస్ నేత శాగ జలంధర్రెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్, ఎస్వి మోడల్ హైస్కూల్ కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ పాల్గొన్నారు