ఆర్యవైశ్యులను ఇబ్బందులు పెడితే సహించo

ఆర్యవైశ్యులను ఇబ్బందులు పెడితే సహించo

ఉన్నతాధికారులు, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
*ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రాజకీయాలను దృష్టిలో పెట్టుకోని ఆర్యవైశ్యులను ఇబ్బందులు పెడితే సహించమని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎ.లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం నార్కట్‌పల్లి- అద్దంకి బైపాస్‌ రోడ్డుపై ఆర్యవైశ్య మహిళ విభాగం రాష్ర్ట మాజీ అధ్యక్షులు రాయపూడి భవానికి చెందిన స్థలాన్ని ఆర్యవైశ్య సంఘం నేతలతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడుతూ సర్వే నెం. 711/అ లో 2012లో 22గుంటల భూమిని కొనుగోలు చేసిందని దానికి సంబంధించిన డాక్యుమేంట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌, ఇంటి నెంబర్లు అన్ని అనుమతులున్నాయన్నారు. అందులో ప్రభుత్వ భూమి ఉందని రెవెన్యూ అధికారులు బలవంతంగా ఫెన్సింగ్‌ను కూల్చడంతో రూ.6లక్షల వరకు నష్టం వాటిళ్లిందన్నారు. ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకండా రాజకీయ కక్షతో ఫెన్సింగ్‌ను కూల్చడం సరికాదన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అవసరమైనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ తిరునగరు
భార్గవ్‌, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శారదా, ప్రధాన కార్యదర్శి నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మీ, రాష్ట్ర నాయకులు చింతల రవి, అదిరి వెంకటేశ్వర్లు, రాయపూడి భవాని, విజయలక్ష్మి, రాయపూడి ఉమాశేఖర్‌, వెంకటేష్
పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking