దూదేకుల కులస్తులు రాజకీయంగా ఎదగాలి

తెలుగు రాష్ట్రాలలో దూదేకుల కులస్తులు రాజకీయంగా ఎదగాలి

నూర్ భాషా దూదేకుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా

ఖమ్మం /అక్షిత బ్యూరో :

తెలుగు రాష్ట్రాలలో దూదేకుల కులస్తులు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయంగా ఎదగాలని నూర్ భాషా దూదేకుల సంగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా అన్నారు.నిన్న ఉమ్మడి విశాఖపట్నం నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనారిటీ జనగర్జన బహిరంగ సభ పెందుర్తిలో ఇస్మాయిల్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమంలో ఏపీ ఎమ్మెల్సీ ముస్లిం మైనార్టీ కి ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడు సలీం మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డ్ సొసైటీ చైర్మన్ నాగులు మీరా ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాజీ మంత్రి ఫరూక్ నూర్ భాషా దూదేకుల సంగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాషా పాల్గొన్నారు.భాష ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన బీసీ ఈ రిజర్వేషన్స్ పై వారితో చర్చించారు.బీసీ-ఈ కి చట్టబద్ధత కల్పించి దానిలో నూర్ భాషా దూదేకుల ముస్లింలను చేర్చాలని దీని కోసమే ఒక ఉమ్మడి కార్యాచరణ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనార్టీ నాయకులు ఒక కార్యచరణ చేసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దూదేకుల సంఘం సీనియర్ నేత చమన్ తనయుడు ఉమర్ ముక్తార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking