అతివలకు అందలం
పట్టుదలతోనే ఉన్నత శిఖరం
సేవల్లో ఇందిర మేటి
డా. చింతకుంట మానిక్ రావు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఎంతటి దూరమైన తొలి అడుగుతోనే ఆరంభమౌతుందని ఫిల్మ్ హీరో, మా ఎగ్జిక్యూటివ్ సభ్యులు డా. చింతకుంట మానిక్ రావు అన్నారు. పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైనా సొంతం అవుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని అలైడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియంలో ఫ్రెండ్ షిప్ మినిస్ట్రీస్, తెలంగాణ అధ్వర్యంలో జరిగిన హనరరీ డాక్టరేట్ అవార్డ్స్ సెరేమోనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ సాహిత్య, కళా రంగాల్లో ప్రతిభ సాధించాలంటే ఎంతో కష్టమన్నారు. ఏళ్ల తరబడి చేపట్టే సాధన ఉన్నత శిఖరాలకు చేర్చుతుందన్నారు.

డా. ఇందిర పాటల ప్రపంచంలో అందె వేసిన చేయిలా ముందుకు సాగుతుందన్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో చక్కటి గీతాలు ఆలపిస్తూ, ఆ రంగంలో ఆసక్తి ఉన్న వారికి తర్పిద్ నందిస్తూ సింగర్స్ గా ప్రోత్సహిస్తుందన్నారు.

విద్య, వైద్య,సామాజిక రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న డా. ఇందిర బర్త్ డే సంబరాలు అంబరాన్నంటాయన్నారు. ఇందిర జీవితం ఎందరో మహిళలకు ఆదర్శ ప్రాయమన్నారు.

అవార్డ్స్ కమిటి అడ్వయిజరీ బోర్డు మెంబర్, సుప్రసిద్ద, రొమాంటిక్ గాయని, ఇందిరా ఫౌండేషన్ అధ్యక్షులు డా. యన్. ఇందిర ప్రసంగిస్తూ ఓ గురి కల్గి సాధన చేస్తే లక్ష్యాన్ని సాధించడం సులువు అన్నారు. సమాజానికి మనమేదో చేయాలన్న తలంపుతోనే సాహితి, సాంస్కృతిక రంగాన్ని ఎంచుకున్నానన్నారు. పాటలపై తనకున్న ఆసక్తితోనే మూడు భాషల్లో అనర్గళంగా… చక్కగా పాడే అవకాశం దొరికిందన్నారు. తన కళా నైపుణ్యాన్ని మరింత మందికి పంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఫ్రెండ్ షిప్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్, ఆర్గనైజర్, కవి, జర్నలిస్ట్ డా. ఆలూరి విల్సన్ మాట్లాడుతూ సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారికి గౌరవ డాక్టరేట్స్ ను ప్రధానం చేస్తున్నామన్నారు. ఆయా రంగాల్లో ఏళ్ళ తరబడి సేవలందించిన వారిని గుర్తించి సత్కరిస్తున్నట్లు చెప్పారు. గౌరవ అతిధి, సీనియర్ జర్నలిస్ట్ దాస్ మాతంగి మాట్లాడుతూ సాహిత్య, కళా రంగాల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మకను వెలికి తీసేందుకు కళా రంగ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినంద నీయన్నారు. ఇందిర సేవలు విశిష్టమన్నారు. మరిన్ని సేవలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనతరం ఎం. సుశీలా రెడ్డి, దాస్ మాతంగి, రామకృష్ణ చంద్ర మౌళి, పాలూరి వెంకట జానకి తదితరులు గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. తొలుత ఇందిర బర్త్ డేను పురష్కరించుకుని కేక్ కట్ చేశారు. చక్కటి గేయాలు, పాటలు, నృత్య ప్రదర్శనలతో సభికులను ఆకట్టుకున్నారు.