అద్దంకి సేవలు చిరస్మరణీయం
అద్దంకికి ఘన నివాళులు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : సీనియర్
పాత్రికేయులు కీ.శే అద్దంకి నాగేశ్వరరావు పదో వర్ధంతి మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన పత్రిక రంగంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐఎంఎ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని సామాజికవేత్త డాక్టర్ జె.రాజు తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఖాజా హమీదుద్దీన్, వాడపల్లి రమేష్, అన్వేషి పత్రిక ఎడిటర్ అన్నెబోయిన మట్టయ్య, పైలం పత్రిక ఎడిటర్ పైలం వెంకటయ్య, ప్రజాలహరి పత్రిక ఎడిటర్ చిట్యాల శ్రీనివాస్ శర్మ, కె.ఉమామహేశ్వర్ రెడ్ది, ఎలుగుబల్లి వెంకట్, బొంగరాల మట్టయ్య, రంగా శ్రీనివాస్ లు పాల్గొన్నారు.