కబంధ హస్తాల్లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు..
ప్రభుత్వ స్థలమని హెచ్చరిక బోర్డు ఉన్న ఆగని అక్రమ నిర్మాణాలు..
కంటైనర్లు వేసి అడ్డదారిలో ట్రైబల్ వెల్ఫేర్ ల్యాండ్ ను కాజేసేందుకు భారీగా స్కెచ్..
వరుస వార్త కథనాలు, ఫిర్యాదులకు స్పందించని రెవెన్యూ అధికారులు
మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధిలో ప్రభుత్వ స్థలాలు కాపాడటంలో రెవెన్యూ అధికారులు విఫలమైపోతున్నారని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.కాలిజాగా కనిపిస్తే చాలు కబ్జాదారులు వాలిపోతున్నారు. దొమ్మరపోచంపల్లి సర్వే నంబర్ 120/11లో కంటైనర్లు వేసి ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు కబ్జాదారులు భారీగా స్కెచ్ వేశారు…దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధిలోని సర్వే నంబర్ 120/11 లోని రెండు ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమిని అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు ఐపీఎస్ ఆదేశాలతో 9 సంవచ్చరాల క్రితం స్థానిక రెవెన్యూ అధికారులు ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహల కోసం కేటాయించారు,స్థానిక ఎమ్యెల్యే కె.పి.వివేకానంద, ఎమ్యెల్సీ శంభిపూర్ రాజు లు ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో కలిసి హాస్టల్ భవన నిర్మాణాలకు 2019లో భూమిపూజ చేశారు. కబ్జాదారులు కోర్టును ఆశ్రయించడంతో హాస్టల్ భనన నిర్మాణానికి బ్రేక్ పడింది,కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా సదరు భూమిలో కంటైనర్లు వేసి కబ్జాలు జోరుగా సాగుతున్నాయి,కబ్జాలపై వరుసగా వార్తా కథనాలు వెలువడుతున్నా రెవెన్యూ అధికారులకు పలు ఫిర్యాదులు అందినా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు,గత 5 నెలల నుండి కబ్జాల పర్వం జోరందుకుంది. కాసులకు కక్కుర్తి పడుతున్న రెవెన్యూ అధికారులు కబ్జాదారులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్ ను వివరణ కోరగా ట్రైబల్ వెల్ఫేర్ కోసం కేటాయిచింది వాస్తవమే అన్నారు,కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ స్థలం కబ్జాలతో కనుమరుగవుతుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం,స్థానిక ఆర్ ఐ కనుసన్నల్లోనే అక్రమనిర్మాణాలు జోరందుకున్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి,సర్వే నంబర్ 120 లో 59 జీవో పేరుతో అక్రమనిర్మాణాలు జోరుగా సాగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు..
ట్రైబల్ వెల్ఫేర్ కోసం కేటాయింపులు ఇలా..
దుండిగల్ మండల దొమ్మర పోచంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 120 లోని ప్రభుత్వ భూమిని అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు ఐపీఎస్ 2015లో ట్రైబల్ వెల్ఫేర్ విభాగం కమీషనర్ అభ్యర్ధనమేరకు ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాలకోసం అనువైన ప్రభుత్వ భూమిని కేటాయించాలంటూ సిఫారసు చేశారు,పరిశీలించిన స్థానిక రెవెన్యూ అధికారులు 120/11 లోని ప్రభుత్వ భూమిని ఐదు సబ్ డివిజన్లు గా విభజించి 2016 లో ప్రొసీడింగ్ లెటర్ ఎల్సీ3/2226/2016 కింద 0.25 గుంటలు,ప్రొసీడింగ్ లెటర్ ఎల్సీ3/2185 కింద 0.20 గుంటలు,ప్రొసీడింగ్ లెటర్ ఎల్సీ3/2184 కింద 0.20 గుంటలు,ప్రొసీడింగ్ లెటర్ ఎల్సీ3/2183 కింద 0.20 గుంటలు,ప్రొసీడింగ్ లెటర్ ఎల్సీ3/2178 కింద 0.20 గుంటలు మొత్తం 2.25 ఎకరాల ప్రభుత్వ భూమిని ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాల కోసం కేటాయించారు.
అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో స్థానిక శాసన సభ్యులు కె.పి వివేకానంద,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శాసన మండలి సభ్యుడు శంభిపూర్ రాజులు ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో కలసి 2019 లో భూమి పూజ చేశారు,కబ్జాదారులు కోర్టుకు వెళ్లడంతో నిర్మాణాలు భూమి పూజ దశలోనే ఆగిపోయాయి,కోర్టు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమనిర్మాణాలు జోరుగా సాగుతున్న రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడంలేదు…
కోర్టును తప్పుదోవ పట్టిస్తూ. కొందరు ఆర్డర్లు తెచ్చి ఎదెచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు..
దొమ్మర పోచంపల్లి సర్వే నంబర్ 120/11 లోని ప్రభుత్వ భూమిని కాజేసేందు కొందరు కబ్జాదారులు స్కెచ్ వేశారు,ఈ క్రమంలో కోర్టును పక్కదోవ పట్టిస్తూ సర్వే నంవర్ 127 లోని ప్రయివేట్ భూమిని చూపిస్తూ సర్వే నంబర్ 120/11 ప్రభుత్వ భూమికి కోర్టులో తప్పుడు పత్రాలు సమర్పించి 58,59 జీవో ల పేరుతో అక్రమనిర్మాణాలకు తెరలేపారు,సదరు కబ్జాలపై ఆర్డీఓ చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ వినిపిస్తుంది..
ప్రభుత్వ స్థలాలో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదు..
సర్వే నంబర్ 120/11 ప్రభుత్వ భూమిలో జరుగుతున్న కబ్జాలపై తహసీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతీన్ ను వివరణ కోరగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు,ఫిర్యాదులు అందాయని,కబ్జాలు తొలగించాలంటూ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు,ఆదేశాలు జారీ చేసి రోజులు గడుస్తున్నా స్థానిక ఆర్ ఐ కబ్జాలపై చర్యలు చేపట్టకపోవవడం పలు అనుమానాలకు తావిస్తుంది.వినికిడి ఏది ఏమైనా ప్రభుత్వ స్థలము కాపాడాలని ప్రజలు కోరుతున్నారు…