దేశానికి ఎల్ బి శాస్త్రి సేవలు చిరస్మరణీయం
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్, అక్షిత బ్యూరో :
మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా హనుమకొండ, బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, స్థానిక నాయకులతో కలిసి నివాళులు అర్పించారు.
జై జవాన్, జై కిసాన్ అంటూ దేశ దృక్కోణాన్ని మార్చిన దార్శనికుడు, ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు ఆధ్యుడు, దేశం కోసం నిత్యం పరితపించిన దేశభక్తుడు,స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న సమరయోధుడు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి అని తెలిపారు.
నిజాయితీకి నిలువెత్తు రూపం, నిబద్ధత కలిగిన రాజకీయ నేత లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నామని. స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రధానిగా శాస్త్రి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు.
ఈ కార్యక్రమమంలో పీసీసీ సభ్యులు శ్రీనివాస్ రావు, ఎంపీ ఆనంద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మా రెడ్డి, బంక సంపత్ యాదవ్,టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ హనుమకొండ చైర్మన్ కేతిడి దీపక్ రెడ్డి,నాయకులు బొంత సారంగం, బిళ్ళ రమణా రెడ్డి, రమేష్, లహరి,ఝాన్సీ తదితరులు ఉన్నారు.