క్రీడలతో శరీర దారుఢ్యం
గట్టికల్లులో కబడ్డీ క్రీడలను ప్రారంభించిన ఎస్ఐ శ్రీకాంత్
ఆత్మకూర్- ఎస్, అక్షిత న్యూస్ :
క్రీడలతోనే శరీర దారుఢ్యం , మానసిక ఉల్లాసం సాధ్యమని ఆత్మకూర్ ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు. ఆదివారం సంక్రాంతి సంబరాలను పురష్కరించుకుని జరిగిన క్రీడలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో యువతీ యువకుల నడుమ స్నేహ సంబంధాలు అలవడుతాయన్నారు. గట్టికల్లు యువకులు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కబడ్డీ ఆట బలం, వ్యూహం జట్టు కృషిని ఉత్కంఠ భరిత ప్రదర్శనను ఇస్తుందన్నారు. ఇక్కడ రైడర్ యొక్క ధైర్యాన్ని, ప్రతి స్పర్శతో పరీక్షిస్తారని, ఇది ప్రాచీన భారతీయ పోరాట స్ఫూర్తిని ప్రతిధ్వనిస్తుందని యువకులను ఉద్దేశించి మాట్లాడారు. ఏదైనా సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే ముందుఁడి పోరాడి మీకు న్యాయం జరిగే వరకు తోడు ఉంటానని దైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో భూపతి, రాములు, కబడ్డీ టీం ఆర్గనైజర్స్ గుండా లింగయ్య, ఇంద్రారెడ్డ, సాయి తదితరులు పాల్గొన్నారు.