త్వరలో రథయాత్ర

బీసీ కులాల సంఘాల ముఖ్య నాయకుల సమావేశం…

సంఘటితంగా ఉంటే సమస్యల సాధన
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :

జై బీసీ జాతీయ అధ్యక్షులు మరియు చైర్మన్ కస్తూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల ముఖ్య నాయకుల సమావేశం జై బిసి రాష్ట్ర కార్యాలయం టిఎన్ జిఓ కాలనీ విప్రో సర్కిల్ ఏరియాలో జరిగింది. ముఖ్య నాయకులైన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం బిసి ఐక్యవేదిక ఇన్చార్జి బీసీ సేవాదళ్ అధ్యక్షుడు ఒంగోరు శ్రీనివాస్ యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, శేరి లింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్, బీసీ రాష్ట్ర ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కృష్ణ , శేరిలింగంపల్లి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ మియాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, వనపర్తి యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మధు యాదవ్ మరియు పెద్దలు బిసి సంఘాల కార్యదర్శులు అభిమానులు సమావేశంలో పాల్గొన్నారు. మొదటగా జైబీసీ అధ్యక్షులు కస్తూరి గోపాలకృష్ణ జై బి.సి సిద్ధాంతాలను రథయాత్ర గురించి విపులంగా చెప్పడం జరిగింది బీసీలు 54% ఉన్నందున జిహెచ్ఎంసి ఎలక్షన్లు 150 డివిజన్లకు అధ్యక్షులుగా నియమించి కార్పొరేటర్ల ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించామని తెలియజేశారు. అదేవిధంగా ఫిబ్రవరి నెల పక్కా ప్రణాళిక ద్వారా హైదరాబాదు నుంచి రథయాత్ర ప్రారంభించాలని కార్యవర్గం నిర్ణయించిందని తెలియజేయడం జరిగింది. శేరిలింగంపల్లి నుండి రథయాత్ర ప్రారంభించి పది డివిజన్లకు అధ్యక్షులుగా నియమించి వారి సహకారంతో నియోజకవర్గ మొత్తం రథయాత్ర చేసి మొత్తంగా 150 డివిజన్లలో బీసీ రథయాత్ర పాదయాత్ర చేద్దామని అందుకు మీరు అందరు సహకరించాలని బీసీ సంఘాలను కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అయ్యేవరకు పాదయాత్ర రథయాత్ర ద్వారా అన్ని జిల్లాల్లో కమిటీలు వేద్దాం మొదటగా హైదరాబాద్ నుండి ప్రారంభించి అన్ని జిల్లాలకు వెళ్దామని అందుకుగాను మీరందరూ సహకరించాలని కోరడం జరిగింది తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ తమ సందేశంలో బీసీ రథయాత్రకు అదే విధంగా తెలంగాణ లో మొదటగా హైదరాబాద్ 150 డివిజన్లో రథయాత్ర పాదయాత్రలో పాల్గొని మీకు సహకరిస్తానని గోపాలకృష్ణ కి హామీ ఇవ్వడం జరిగింది. రామచందర్ యాదవ్ సంఘాలను ఉద్దేశించి శేరిలింగంపల్లి నుండి పది డివిజన్లను కమిటీలు వేస్తూ వీలైనంత త్వరలో హైదరాబాదులోని కనీసం 100 డివిజన్లకు కమిటీలు వేసి బీసీల ఐకమత్యం కొరకు అందర్నీ ఏకం చేయడమే తన లక్ష్యమని అధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేద్దామని అన్ని బీసీ సంఘాలను ఏకం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ను కలుపుకొని రాజ్యాధికార దిశగా పోరాటం చేద్దామని లక్ష్యంతో గోపాలకృష్ణకి తప్పక సహకరిస్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు స్థాయి నుండి హైదరాబాద్ కార్పొరేషన్ వరకు కూడా బీసీలు పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులకు పిలుపునిచ్చారు. రథయాత్ర పాదయాత్ర ద్వారా మొదటగా పాత పది జిల్లాలు కమిటీలు వేసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీలను ఏకం చేస్తూ ఐకమత్యం సాధించి మన ఓట్లు మనమే వేసుకునే విధంగా పనిచేద్దామని సంఘాలకు తెలియజేశారు బీసీ సేవాదళ్ అధ్యక్షుడుఒంగోరు శ్రీనివాస్ యాదవ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ మాట్లాడుతూ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అయ్యేవరకు మనమందరం శ్రమకు ఓర్చి రథయాత్ర పాదయాత్రద్వారా మొదలుపెట్టి బీసీల అందరినీ ఏకం చేసి ఐకమత్యంతో అధికారం సాధిద్దామని అన్ని సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు నాయకులు ఏకమై ఐకమత్యంతో పక్కా ప్రణాళిక ద్వారా పనిచేద్దామని అధికారమే మన లక్ష్యం కాబట్టి తప్పక సాధిద్దాం అని నాయకులకు పిలుపునిచ్చారు. రథయాత్ర పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది బీసీలను ఏకం చేయాలని మన ఉద్దేశం. ముఖ్యంగా బీసీలకు త్యాగశీలనతో సేవా చేయటానికి సేవాదళ్లను ఏర్పాటుచేసి బలోపేతం చేద్దాం బీసీ త్యాగదనులను ఆహ్వానించి మనలో కలుపుకొని వారి సేవలను వినియోగించుకొని తప్పక అధికారం సాధిస్తామని గంటాపతంగా నమ్మకంతో తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ సంభాషిస్తూ మనమందరము సమానం ఎన్ని కుల సంఘాలు ఉన్న బీసీ సంఘాలుఏకం కావాలని ఏకమై ఐకమత్యం తో అధికారం సాధించటానికి బీసీ రథయాత్ర బీసీ నాయకుల పాదయాత్ర ఉపకరిస్తుందని అధికారమే అంతిమ లక్ష్యంగా పని చేద్దామని అన్ని బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు ముఖ్యంగా మన ఐకమత్యమే మనకు బలం ఓటు మన ఆయుధం మన బీసీ ఓట్లు 54 శాతం మన ఓట్లు మనమే వేసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ల సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం అధికారంలోకి వస్తుందని అందుకు మనం కృషి చేయాల్సిన అవసరం ఉందని సంఘాలకు తెలుపడం జరిగింది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ముద్ర వేసి గ్రామ వార్డు స్థాయి నుండి జిహెచ్ఎంసి కార్పొరేటర్ చైర్మన్ వరకు కూడా బీసీలు పోటీ చేసి ఐకమత్యంతో గెలవాలని కోరడం జరిగింది. అడుక్కుంటే అధికారం ఎవ్వరు మనకు ఇవ్వరు మనము గెలవాలి ఈ అగ్రవర్ణాల నుండి అధికారం మనం లాక్కోవాలి అదే మనం ముందున్న ఏకైక లక్ష్యం అధికారంతో పేదలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్న సమస్యలన్నీ తీరుతాయి అని ధనస్వామ్యంలో ఈ అగ్రవర్ణాల రాజ్యంలో వాళ్ల అధికారంతో మనకు ఎన్నిటికి న్యాయం జరగదు బీసీ లందరూ ఏకం కావాలి ఐకమత్యంతో అధికారం సాధించాలని పిలుపునిచ్చారు . బీసీ సంక్షేమ సంఘం శేరిలింగంపల్లి అధ్యక్షులు రమేష్ యాదవ్ అడ్వకేట్ తన సందేశంలో బీసీలు ఏకం కావాలని ఐకమత్యంతో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బిసి లందరూ తమ ఓట్లు తామే వేసుకొని అధికారం సాధించాలని కోరడం జరిగింది మన సత్తా ఏమిటో లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని తెలియ చేశారు. బీసీలు తప్పక పోటీ చేయాలని పిలుపునిచ్చారు రథయాత్ర నాయకుల పాదయాత్ర మనకు తప్పక న్యాయం చేస్తుందని అధికారం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బి కృష్ణ నర్సింగ్ ముదిరాజ్ మధు యాదవ్ మిగతా పెద్దలు కూడా సమావేశాన్ని ఉద్దేశించి పూర్తిగా మద్దతు తెలుపుతూ బీసీల ఐకమత్యం ఏకం కావటమే లక్ష్యం. రథయాత్ర ద్వారా పాదయాత్ర ద్వారా బీసీల ఐకమత్యం పెంపొందించి ఏకమై రాజ్యాధికారం కోసం పోరాటం ఉద్యమం చేసి ఎన్నికల్లో గెలుద్దామని గోపాలకృష్ణ కి హామీ ఇవ్వడం జరిగింది. బీసీ నాయకులు సంఘాలను ఒకరికి ఒకరు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి వాతావరణంలో సమావేశం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking