తెలంగాణ సంప్రదాయాలను పాటిద్దాం
ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
– ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల
అక్షిత ప్రతినిధి, ఆర్మూర్ :
ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలో ఈ .ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సరళరాణి హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరై ఉత్సాహంతో ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరిగింది. ముగ్గుల పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులను ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈ.ఆర్ ఫౌండేషన్ సభ్యులు ఇరవర్తి రాజశేఖర్ ,అర్గుల్ సురేష్, న్యాయవాది అమితాబ్ కిరాడ్ ,మున్సిపల్ కౌన్సిలర్ బదాం రాజ్ కుమార్, రాంప్రసాద్, దోండి గంగామోహన్, సడక్ ప్రమోద్ ,కొండి రామచందర్ ,పిప్రిసాయన్న ,ఇస్తక్ అహ్మద్, పోహార్ శేఖర్ ,అర్గుల్ నరసయ్య ,బాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.