అలరించిన రంగ వల్లులు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు ప్రాంతమైన మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలు, వాడల్లో సంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగను మంగళవారం జరుపుకున్నారు. జనవరి ఒకటి తెల్లవారుజాము నుండి ఇళ్ల ముంగిట ప్రారంభమైన ముగ్గులు సంక్రాంతి పండుగ నాటికి భారీ ఎత్తున వేశారు. మహిళలు మంగళవారం తెల్లవారు జాము నుండి పోటీ పడి ముగ్గులు వేశారు. అదేవిధంగా దేవాలయాల్లో పూజలు చేశారు.
దేవాలయాలలో మహిళలు, పిల్లలు, రైతులు పూజల్లో పాల్గొన్నారు. రైతులు తమ ఇళ్ల ముంగిట ముగ్గుల మధ్య గొబ్బిళ్ళలో నవధాన్యాలు వేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజ్యసింహారెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, మాజీ చైర్మన్ తిరునగరు నాగలక్ష్మి భార్గవ్, ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ, రైతు బంధు మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు ప్రజలకు, రైతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.