ఘనంగా అయ్యప్ప ఆలయంలో
మకర జ్యోతి దర్శన పూజలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణం అశోక్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర జ్యోతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నేడు శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శనం సందర్భంగా మిర్యాలగూడ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మకరజ్యోతి దర్శనం భాగ్యాన్ని పట్టణవాసులకు కల్పించినట్లు పేర్కొన్నారు. మండల కాలం అయ్యప్ప స్వామి మాల దీక్షలో పాల్గొన్న స్వాములు ఎన్నో కష్టాలు లెక్క చేయక స్వామివారి దీక్షలో పాల్గొని నేడు మకర జ్యోతి దర్శనం అనంతరం దీక్షకాలం ముగిసినట్లుగా ఆయన తెలిపారు.
మకర జ్యోతి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ వారికి మిర్యాలగూడ అయ్యప్ప స్వాములు తమ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గురుస్వాములు అయ్యప్ప దీక్షస్వాములు పాల్గొన్నారు.