*రామ్ సాగర్ గ్రామంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్*
కొమరవెల్లి అక్షిత న్యూస్:
ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రామ్ సాగర్ గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా వాలీబాల్ పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామ్ సాగర్ యువత అధిక సంఖ్యలో పాల్గొని పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం, కొమురవెల్లి మండల కార్యదర్శి తాడూరి రవీందర్, సిపిఎం మండల కమిటీ సభ్యులు తాడూరి మల్లేశం, ఎస్ఎఫ్ఐ చేర్యాల డివిజన్ కార్యదర్శి తాడూరి భరత్, డివైఎఫ్ఐ మండల నాయకులు దాసరి మహేష్, ప్రశాంత్, నవీన్, వివిధ సంఘాల నాయకులు వివిధ యూత్ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు