నర్మెట్టలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం నూతన కమిటీ ఎన్నిక..
నంగునూర్, అక్షిత ప్రతినిధి :
నర్మేటలో నూతన అంబేద్కర్ కమిటీని ఎన్నుకోగా. కొత్త కమిటీ అధ్యక్షుడు కత్తి బాలకృష్ణ,
ఉపాధ్యక్షుడుగా పుర్ర రాజు, ప్రధాన కార్యదర్శిగా మంకాల రాజు, కార్యదర్శిగా లింగంపల్లి రాజు
కోశాధికారిగా గంధమల్ల చిరంజీవిని
సలహాదారులుగా గంధమల్ల పెంటయ్య, లింగంపల్లి యాదగిరి, చిట్యాల కనకయ్య,పుర్ర రాజా రత్నం, లింగంపల్లి శ్రీనివాస్, చిట్యాల తిరుపతి, పుర్ర లింగం, గంధమల్ల కనకయ్య, గంధమల్ల రఘురాం ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కత్తి బాలకృష్ణ మాట్లాడుతూ జాతి కోసం కాలనీ వాసుల కోసం అంబేద్కర్ ఆశయాల కోసం నాకు ఇచ్చిన పదవి ఉన్నంతకాలం నిరంతరం శ్రమిస్తూ ఉంటానని నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు అధ్యక్ష పదవి ఇచ్చిన కాలనీవాసులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత,నూతన కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.