అక్షిత అక్షరం… ప్రజాదర్పణం

అక్షిత అక్షరం… ప్రజాదర్పణం

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ఉన్నది ఉన్నట్లు…ఉండదు కనికట్టు తరహా ప్రజల చేతుల్లో పాశుపతాస్రంగా ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా అక్షిత అక్షర యజ్ఞం సాగిస్తుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళ వారం బిఆర్ కే భవన్ అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక 2025 క్యాలెండర్ ను అక్షిత చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగితో కలిసి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ ప్రజలకు… ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజాయుధంగా అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక ముందుకు సాగుతుందన్నారు. నిజాలను నిర్భయంగా… స్వేచ్ఛగా రాస్తూ ప్రజల సమస్యలకు వాస్తవ దర్పణం పడుతుందన్నారు.

వివిధ ప్రధాన స్రవంతి కల్గిన పత్రికల్లో విశిష్ట సేవలందించిన అనుభవంతో చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి సారథ్యంలో గత పదిహేనేళ్లుగా అక్షిత అక్షర సమరం మోగిస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. మూడు దశాబ్దాల తన జర్నలిజం పయనంలో ముక్కుసూటిగా, ఉన్నది ఉన్నట్లుగా వార్తలు రాస్తూ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అక్షిత తెలుగు జాతీయ దినపత్రికను గత పదిహేనేళ్లుగా ప్రజల సంక్షేమం, అభివృద్ధికై అక్షిత అక్షర శంఖారావం సాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చిన్న మధ్యతరహా దిన మాస పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్, బొమ్మపాల వెంకటయ్య, సీహెచ్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*అక్షిత అక్షరం.. ప్రజాహితం*

టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ

ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజాహితంగా అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక పరిడవిల్లుతుందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ ఆకాంక్షించారు. మంగళవారం అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ మాట్లాడుతూ ప్రజల చేతుల్లో పాశు పతాస్త్రంగా..ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా అక్షిత అక్షరయజ్ఞం సాగిస్తుందన్నారు. నిజాలను నిర్భయంగా స్వేచ్ఛగా రాస్తూ ప్రజల సమస్యలకు వాస్తవ దర్పణం పడుతుందన్నారు. వివిధ ప్రధాన స్రవంతి కల్గిన పత్రికల్లో విశిష్ట సేవలందించిన అనుభవంతో చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి సారథ్యంలో గత పదిహేనేళ్లుగా అక్షిత అక్షర సమరం మోగిస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. వాస్తవాలకు దర్పణం పట్టేలా అక్షిత అక్షర సమరం సాగిస్తుందన్నారు. అనతి కాలంలోనే పాఠకుల ఆదరణను చురగొని ప్రధాన స్రవంతి కల్గిన పత్రికలకు ధీటుగా అక్షిత వెలుగొందు తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చిన్న మధ్యతరహా దిన మాస పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్, బొమ్మపాల వెంకటయ్య, సీహెచ్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking