ఉన్నది ఉన్నట్లు… ఉండదు కనికట్టు
ప్రజల పక్షం… అక్షిత అక్షరం
ఐఅండ్ పిఆర్ స్పెషల్ కమీషనర్ డా. హరీష్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఉన్నది ఉన్నట్లు… ఉండదు కనికట్టుగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా అక్షిత అక్షర యజ్ఞం సాగిస్తుందని ఐఅండ్ పిఆర్ స్పెషల్ కమీ షనర్ డా. హరీష్ అన్నారు. మంగళ వారం అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక 2025 నూతన క్యాలండర్ ను అక్షిత చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా.. స్వేచ్ఛగా రాస్తూ ప్రజల సమస్యలకు వాస్తవ దర్పణం పడుతుందన్నారు. వివిధ ప్రధాన స్రవంతి కల్గిన పత్రికల్లో విశిష్ట సేవలందించిన అనుభవంతో చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి సారథ్యంలో గత పదిహేనేళ్లుగా అక్షిత అక్షర సమరం మోగిస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు.

వాస్తవాలకు దర్పణం పట్టేలా అక్షిత అక్షర సమరం సాగిస్తుందన్నారు. అనతి కాలంలోనే పాఠకుల ఆదరణను చురగొని ప్రధాన స్రవంతి కల్గిన పత్రికలకు ధీటుగా అక్షిత వెలుగొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చిన్న మధ్యతరహా దిన మాస పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.