ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలను ఇస్తాం
–ఖమ్మం జిల్లాను రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలుపుతాం
–డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క హామి
-ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు ఇప్పించడం నాబాధ్యత : తుమ్మల
ఖమ్మం / అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలను ఇప్పించి రాష్ట్రానికి ఖమ్మం జిల్లాను రోల్ మోడల్ గా నిలిపేందుకు క్రషి చేస్తానని రాష్ట్ర డిప్యూటి ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామి ఇచ్చారు.ఖమ్మం నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన మూడు జర్నలిస్టుల ప్రతినిధులు, స్ధంభాద్రి జర్నలిస్టు హౌజింగ్ సోసైటి ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలోప్రజాభవనంలో భట్టిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. గత ప్రభుత్వం ఖమ్మం నియోజకవర్గ జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలను కేటాయిస్తూ జివో జారీ చేయడంతో పాటు స్ధలాన్ని కూడా కేటాయించిందని సోసైటికి స్ధలాన్ని అప్పగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం నుంచి అంతా సిద్దం అయిన తరుణంలో రాష్ట్రాన్ని సాకుగా చూపించి ఖమ్మంలో నిలిపివేశారని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు భట్టికి వివరించారు.

తాము ప్రభుత్వ మార్కేట్ విలువకే భూమిని కొనుగోళ్ళు చేస్తున్నందున ఖమ్మం సోసైటికి సుఫ్రింకోర్టు తీర్పు వర్తించదని స్పష్టం చేశారు. దీనికి స్పందించిన భట్టి నిబంధనల ప్రకారం జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలను అప్పగించి ఖమ్మం జిల్లాను రాష్ట్రానికి అదర్శంగా నిలుపుతామన్నారు.
*ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలను ఇప్పించడం నాబాధ్యత*
–మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం నియోజకవర్గం పరిధిలో పనిచేసే జర్నలిస్టులకు స్దానిక ఎమ్మెల్యేగా మంత్రిగా ఇళ్ళ స్ధలాలను ఇప్పించడం తన భాద్యత అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. రఘునాధపాలేం మండలం మల్లెపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన ప్రజాపాలన సభ అనంతరం మూడు జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు స్ధంభాద్రి హౌజింగ్ సోసైటి ప్రతినిధులు మంత్రి తుమ్మలను కలిసి జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల సమస్యపై వినతి పత్రాన్ని అందించగా పై విధంగా స్పందించారు తాను అధికారులతో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకోని మీ సమస్య పరిష్కరించేందుకు క్రషి చేస్తానని హామి ఇచ్చారు.ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దని దీర్ఘకాలింగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన హామి ఇచ్చారు.ఇద్దరు మంత్రులను కలిసిన వారిలో టియుడబ్ల్యుజె (ఐజెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రాంనారాయణ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు టియుడబ్ల్యుజె టిజెఎఫ్ జిల్లా కార్యదర్శి చిర్రారవి స్ధంభాద్రి హౌజింగ్ సోసైటి అధ్యక్షులు కనకం సైదులు కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మైసాపాపారావు కోశాధికారి వై సాంబశివరావు సీనియర్ పాత్రికేయులు నల్లజాల వెంకట్రావ్ మాటేటి వేణుగోపాల్ లింగయ్య మైనోద్దిన్ మామిడాల భూపాల్ రావు తాళ్ళూరి మురళీ క్రష్ణ మహేందర్ శివ జనార్దన చారి నామ పురుషోత్తం కళ్యాణ్ పసుపులేటి సత్యనారాయణ శ్రీనివాస్ వేణుగోపాల్ మేడి రమేశ్ ప్రశాంత్ రెడ్డి రజీనికాంత్ రమేశ్ బాబు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.