అంబేడ్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు కృషి

అంబేడ్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు కృషి

* లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
* ప్రిన్సిపాల్ తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించిన హమీద్ షేక్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు కలిసికట్టుగా కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయవాది, నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ పిలుపునిచ్చారు. మిర్యాలగూడ పట్టణంలో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హమీద్ షేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రిన్సిపాల్ కేకే జయరాజన్, హెడ్ మాస్టర్ సుజేశ్ లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం విద్యార్థులకు, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హమీద్ షేక్ మాట్లాడారు. భారత రాజ్యాంగం 1956, జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చిందన్నారు. ప్రజాస్వామిక, సార్వభౌమ, గణతంత్ర రాజ్యంగా భారతదేశం వర్థిల్లుతున్నదని అన్నారు. పాలకులు భారత రాజ్యాంగం అందించిన హక్కులను ప్రతి పౌరునికి దక్కేలా రాజ్యాంగం మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆకాంక్షించారు. భారత రాజ్యాంగ నిర్మాతల ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని పేర్కొన్నారు. ప్రతి పౌరుడి క్రమానుగత వృద్ధికి అత్యవసరమైన సామాజిక న్యాయాన్ని సాధించడం మన రాజ్యాంగ లక్ష్యమని అన్నారు.

అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి ప్రతిభ కనబర్చిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం కేకే జిన్సీ, హెడ్ మాస్టర్ సుజేష్, రవి కుమార్, ప్రసాద్, ప్రయిమరీ సెక్షన్ ఇంచార్జీ రాధిక, అధ్యాపక బృందం, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking