జాతీయ పతాకాల పంపిణీ బేష్…!

జాతీయ పతాకాల పంపిణీ బేష్…!

ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.మధు

స్ఫూర్తి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఇబ్రహీంపట్నం, అక్షిత ప్రతినిధి: స్ఫూర్తి యూత్ చేపట్టిన జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమం ప్రజల్లో దేశభక్తిని పెంపొందించి కార్యక్రమమని ఇంచార్జి ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు అన్నారు. ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్ ఎదురుగా స్ఫూర్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇబ్రహీంపట్నం ఇంచార్జి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.మధు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ ఎ.మధు మాట్లాడుతూ…. జాతీయ పండుగ అయినటువంటి గణతంత్ర దినోత్సవం వేడుకలకు మన సమాజం సంఘంలోని ప్రతి పౌరుడు దేశభక్తి చాటుతూ జాతీయ జెండాను ధరించాలనే ఉద్దేశంతో 25 సంవత్సరాలుగా జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం చేస్తున్న స్ఫూర్తి యూత్ సభ్యుల సేవలు అభినందనీయమని, ఇంకా పలు సమాజసేవ కార్యక్రమాలు చేపడుతున్న యూత్ సభ్యుల పనితీరును ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే 143 యూనియన్ నియోజవర్గ అధ్యక్షులు సురమోని సత్యనారాయణ, టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్ కౌన్సిలర్ భర్తకి జగన్ స్ఫూర్తి యూత్ ఇన్చార్జి సురమోని బాబు యూత్ నాయకులు డి. సాయిరాం, బుద్ధి దీపక్, శ్రీకాంత్, నరేష్ యాదవ్,శివ గౌడ్,భాస్కర్ రెడ్డి, జి,సాయిరాం గుప్తా, జి. వెంకటేష్,శంకర్ గౌడ్, మణిసాయి గౌడ్, క్రాంతి కుమార్, సోహెల్,శివ, సిహెచ్ భాస్కర్, జి మధుకర్, పవన్ జర్నలిస్టులు సోప్పరి యాదగిరి, పానుగంటి నరేందర్,జూబ్బురు కుమార్ నాయకులు బండి మహేష్, సూరంపల్లి నవీన్ సాగర్, ముత్యాల సంతోష్,లతీఫ్, రాజు సాగర్,యాదగిరి చారి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking