కదిలిన మున్సిపల్ యంత్రాంగం!

అక్షిత ఎఫెక్ట్…

మరణిస్తే మాకేం మామూళ్లు చాలు !

బేకరీ స్వీట్ హోం ల కథనానికి కదిలిన మున్సిపల్ యంత్రాంగం!

– ట్రేడ్ లైసన్ లేని దుకాణలకు నోటీసులు

ఆర్మూర్, అక్షిత ప్రతినిధి :

ఆర్మూర్, పట్టణంలోని స్వీట్ హోమ్ బేకరీలపై మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్, రాజు, ఆదేశాల ప్రకారం సానిటరీ ఇన్స్పెక్టర్. కమిషనర్, ఆదేశానుసారం పట్టణంలోని కొత్త బస్టాండ్ ఏరియాలో పలు హోటల్లు, బేకరీలు స్వీట్ హోమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రతపై సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై తనిఖీలు నిర్వహించడం జరిగినది అలాగే పలు దుకాణాల ట్రేడ్ లైసెన్స్ ను తనిఖీ చేయడం జరిగినది తనిఖీలలో ట్రేడ్ లైసెన్స్ లేనివారికి నోటీసులు జారీ చేయడం అయినది ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హోటల్లు బేకరీలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పరిశుభ్రతను పాటిస్తూ నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని సూచించడం జరిగినది వ్యాపారం చేసుకునే ప్రతి వారు ట్రేడ్ లైసెన్స్ ను కలిగి ఉండాలని లేనిచో జరిమానా విధించబడునని తెలియజేశారు. ఈ తనిఖీలలో సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ పర్యావరణ, ఇంజనీర్ పూర్ణమౌళి ,వార్డ్ ఆఫీసర్ పృథ్వీరాజ్, సిబ్బంది అక్షయ్, రాము, నరసయ్య, ప్రశాంత్, రవి రమేష్, పాల్గొన్నారు.

* మున్సిపల్ కమిషనర్ రాజు *

ఆర్మూర్ పట్టణం లో బేకరీ లు స్వీట్ హోం లు, హోటల్లు, పాస్ట్ ఫుడ్,సెంటర్లు, నడిపే యాజమాన్యం తప్పకుండ మున్సిపల్ చట్టం ప్రకారం నియమాలు పాటించాలని అన్నారు. ట్రేడ్ లైసెన్స్ తప్పక కలిగి ఉండాలని నాణ్యమైన నూనెలను పిండి పదార్థాలను వినయోగించాలనిఅన్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల శుభ్రతా పాటించాలి ప్రజల అరగ్యం ముఖ్యం గనుక యాజమాన్యం తప్పక శుభ్రతా పరిశుభ్రత, పాటించాలిఅని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking