టిబి నిర్దారణ పరిక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
48వ వార్డు మాజీ కౌన్సిలర్ వెలుగు వెంకన్న
సూర్యాపేట, అక్షిత ప్రతినిధి:
ప్రతి ఒక్కరూ టిబి నిర్దారణ పరిక్షలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యం పరిరక్షించుకోవాలని సూర్యాపేట 48 వ వార్డు మాజి కౌన్సిలర్ వెలుగు వెంకన్న అన్నారు. శుక్రవారం నాడు 48వ వార్డు కోట మైసమ్మ బజార్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టిబి నిర్దారణ, బిపి, షుగర్ పరీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించిమాట్లాడారు.పేదల వార్డులో ప్రభుత్వం టీవీ నిర్ధారణ పరీక్షలు చేయడం హర్షనీయమన్నారు. నిరుపేదలు అధికంగా ఉన్న ఈ వార్డులో పెద్ద ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోలేని పేదలకు ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో టిబి నిర్దారణ పరీక్షలతో పాటు బిపి, షూగర్ పరిక్షలను ఉచితంగా చేసి, టిబి పాజిటివ్ వచ్చిన వారికి మూడు నెలల పాటు మందులు ఇస్తారని అన్నారు. టిబి వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించాలని లేకపోతే శరీరంలో వ్యాపించి జీర్ణవ్యవస్థ ను దెబ్బతీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలోడాక్టర్ శివప్రసాద్, సూపర్వైజర్ ఏకస్వామి, ల్యాబ్ టెక్నీషియన్ సుష్మ, ఏఎన్ఎం చిలకమ్మా, ఆశా కార్యకర్తలు విజయ, మణెమ్మ, పి. శ్రీలత, బి.శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post