అ’పూర్వ’ కలయిక

అ’పూర్వ’ కలయిక
19 ఏళ్ల తర్వాత కలుసుకున్న 2005-06 విద్యార్థులు…

జనగామ/ బచ్చన్నపేట, అక్షిత ప్రతినిధి:

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్ లో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. బచ్చన్నపేట జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు చెందిన 2005-06 పదవ తరగతి విద్యార్థులంతా ఒక్కచోట చేరారు. బడిలో తాము చదువుకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు… ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ… జీవితంలో వచ్చే కష్టాలను నిచ్చెనలుగా మార్చుకొని ఎదగాలని సూచించారు… ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పిల్లల పెంపకం‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు… పూర్మ విద్యార్థుల సమ్మేళనం అనేది కేవలం వేడుకగా ఉండొద్దని… తోటి విద్యార్థులకు… చదువుకున్న బడికి తోచినంత సాయం చేసేలా ఉండాలన్నారు… సమావేశంలో ఉపాధ్యాయులు డీవీఎల్ఎన్ మూర్తి, బండ మురళి, రాజేందర్, హిమబిందు, పి.చంద్రశేఖర్ రావు, బి.ఆంజనేయులు, పృద్వీరాజ్, బాలకిషన్, సురేశ్ బాబు, వెంకటేశ్వర్లు… విద్యార్థులు శ్రీకాంత్ రెడ్డి, కవిత, రమేశ్ రెడ్డి, షరీఫ్, జి. నాగరాజు, డి. నాగరాజు, సురేశ్, చంద్రశేఖర్, రమాతార తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking