గురుకులాల ప్రవేశ పరీక్షలుప్రశాంతం…!
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్…!!
జనగామ, అక్షిత ప్రతినిధి:
సాంఘిక సంక్షేమ గురుకులాలలో విద్యార్థులు చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు.ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంబంధిత శాఖ అధికారి విక్రమ్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ ఆదేశాలతో గురుకులాల ప్రవేశపరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు.

జిల్లాలో గురుకులాలలో ప్రవేశం కొరకు 6,7,8,9 తరగతులలో విద్యార్థుల ఎంపిక కొరకు 9 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.గురుకులంలలో చేరేందుకు 1865 మంది దరఖాస్తు చేసుకోగా
అందులో 14 మంది దరఖాస్తులు రిజెక్ట్ అయినట్లు, 51మంది విద్యార్థులు గైరుహజరు అయినట్లు పేర్కొన్నారు.విద్యార్థుల ప్రవేశాల కొరకు జనగామ జిల్లాలో 9 కేంద్రలు ఏర్పాటు చేయగా జనగామ మున్సిపల్ పరిధిలో 3, బచ్చన్నపేట మండలంలో 2, కరుణపురం లో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొడకండ్ల లో 1, జాఫర్ గడ్ లో 1, పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన్నట్లు వివరించారు.ఈగురుకులంలలో చేరేందుకు ప్రవేశ పరీక్షలకు 1800 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 97శాతం హాజరు నమోదైనట్లు వివరించారు.