కోరిన కోరికలు తీర్చే కొడవటూరు సిద్దులగుట్ట శ్రీ సిద్దేశ్వర స్వామి…
బ్రహ్మోత్సవాలకు తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల భక్తులు…
సిద్దేశ్వర స్వామి శ్రీ సిద్దుల గుట్ట చరిత్ర…
సిద్దుల గుట్ట నుండి కొన్నెగుట్ట, సిద్దంకి, కొలనుపాక… దక్షిణ కాశి , కోటొక్క లింగం అనే ప్రాంతంలో…(ప్రసిద్ధ జైనుల ఆలయము) వరకు సొరంగ మార్గాలు…
నేటి నుండి ఫిబ్రవరి 27 వరకు సిద్దుల గుట్ట బ్రహ్మోత్సవాలు…
(వనమైన వెంకటేష్ గౌడ్ )
జనగామ/ బచ్చన్నపేట/ సిద్దులగుట్ట, అక్షిత ప్రతినిధి:
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం… కొడవటూరు శ్రీ సిద్దేశ్వరాలయంలో నేటి నుండి ఫిబ్రవరి 27 వరకు జరుగు… బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చే కొడవలూరు శ్రీ సిద్దేశ్వర స్వామి సిద్దుల గుట్ట ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి… ఉమ్మడి వరంగల్ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నుంచి బ్రహ్మోత్స వాలు ప్రారంభం కానున్నాయి… ప్రతీయేటా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ అన్ని జిల్లాలతో పాటు… పలు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక… రాష్ట్ర రాజధాని హైద్రాబాద్, సంగారెడ్డి రంగారెడ్డి మెదక్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్లగొండ తదితర ప్రాంతాల
నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారు. భక్తుల కొంగుబంగారంగా కొలిచే శ్రీ స్వయంభూః సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభంగా జరుగనున్నాయి. అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా (పెద్ద సంఖ్యలో) వస్తారు. 24 సోమవారం ప్రారంభమయ్యే ఉత్సవాలు 27వ తేదీన కొనసాగుతాయి.

ప్రతినిత్యం ఆలయంలో పూజాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు…. 27న అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం ఉంటుందని ఆలయ దేవస్థానం చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, ఆలయ కార్య నిర్వహణ అధికారి చిందం వంశీ, దేవాదాయ ప్రధాన పూజారి ఓం నమశ్శివాయలు తెలిపారు.
సిద్దుల గుట్ట ఆలయ చరిత్ర…
పక్షుల కిలకిలరావాలు, పచ్చని పైర్లు ఎటుచూసిన ఆహ్లాదకరమైన
వాతావరణం నడుమ ఒకవైపు దివ్యక్షేత్రంగా, మరోవైపు పర్యాటక
ప్రాంతంగా జనుల్ని విశే షంగా ఆకర్షిస్తుంది… సిద్ధులగుట్ట, ఉమ్మడి వరంగల్ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు భక్తుల కొంగుబంగారంగా కీర్తించబడుతున్న…
సిద్ధేశ్వరఆలయం ఉంది. ఇక్కడే లింగాకా రములో సిద్దులగుట్ట… నంది
ఆకారంలో కొయిసగుట్టలున్నాయి. సిద్ధులు (అన్న పానీయాలు స్వీకరించక
గాలిని మాత్రమే ఆహారంగా తీసుకునేవారు) మహిమచే ముసులు (ప్రకృతి
సిద్ధంగా లబించి కాయలు, కందములను ఆహారంగా తీసు కుంటూ
జీవించేవారు…) భక్తులు పూజించి తరించుటకు అవతరించిన సిద్ధయో లింగమే
ఈ సిద్ధేశ్వరస్వామియని అంటారు.

నిష్టతో పూజలు నిర్వహించిన యెడలకోరికలు తీరుతాయనే విశ్వాసాన్ని భక్తులు వెలువరిస్తారు… సిద్దుల గుట్టచుట్టు రెండు కిలోమీటర్ల దూరం వరకు పూర్వం శివాలయాలు ఉన్నట్లుగా ఆధారాలు
కనబడుతాయి… సిద్దుల గుట్టపైన కప్పుగుండం, సిద్దులు గుండం, పెద్ద గుండంతో
పాటు బాలసిద్ధులు గుండం నుండి గర్భాలయం వరకు సిద్దెంకి, కొన్నె.
కొలనుపాక సోమేశ్వరాలయం వరకు సొరంగమార్గాలున్నాయి… ఆలయానికి
ఉత్తరం వైపు ముక్కంటీశ్వర ఆలయం ఉంది…దీనిలో కాకతీయులు
కళానైపుణ్యం ఉట్టిపడుతుంటుంది… గుడికి కిలోమీటర్ దూరంలో ల్యాచోట
ఉంది… ఎటు చూసిన 13గజముల దూరం 256 ఒకే ఆకారంతో రాళ్లు
వరుసగా కనబడుతాయి… దీనికి ఒక చరిత్ర ఉంది. మామిడి తోటలోని పండ్లు…
రోజు మాయమవడంతో కాపలాదారుడు కావలి ఉండగా…
ఆర్ధరాత్రి రుషులు, మునులు వచ్చి పండ్లను కోస్తుండగా
ఎదురించాడని… దీంతో వారు ఆగ్రహించి శపించడంతో తోటతో
పాటు కాపరి శిలలుగా మారిపోయారని చెబుతారు….

–గుహలు సొరంగమార్గాలు..:
బాలసిద్ధులు గుడి నుండి గర్భాలయం వరకు ఉన్న
సొరంగమార్గం ద్వారానే రుషులు వెళ్లి పూజలు జరిపించేవారని
ఇది గమనించిన దొంగలు సొరంగం నుండి వచ్చి విలువైన
వస్తువులు, హుండీ దొంగిలించడంతో దానిని మూసివేశారు.
అలాగే కొన్నె, సిద్దెంకి, కొలనుపాక సోమేశ్వరాలయం వరకు
సొరంగమారాలున్నది నిజమా కాదా అని తేల్చకోవడానికి
గ్రామానికి చెందిన పలువురు సాహసంతో రెండు ఫర్లాంగుల వరకు వెళ్లగా…
అక్కడ రాతి తలుపులతో మూసి ఉండటంతో వాటిని తాకే సాహసం చేయక
వెనుదిరిగి వచ్చినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతారు…

అలాగే పెద్దగుండం సమీపంలో పూదోట ఉంది… అంతేగాక ఔషధ వనమూళికలు పెద్ద ఎత్తున
ఉన్నట్లు పెద్దల ద్వారా వెల్లడవుతుంది… గుట్ట క్రింద బావిలోని నీరు సేవిస్తే
అనారోగ్యం బారిన పడరని… పసరికలు విశ్వసిస్తుంటారు… నైజాం నవాబు
సైతం ప్రత్యేకించి ఈ బావి నీరు తెప్పించుకుని సేవించేవాడని పెద్దలు
దెబుతున్నారు…
దినదినం పెరుగుతున్న సిద్ధయోగ లింగం…
మహిమాన్వితమైన సిద్ధయోగ లింగం దినదినం పెరుగుతుందని
భక్తులు… ఆలయ పూజారులు చెబుతున్నారు… 100 సంవత్సరాల క్రితం
లింగం చుట్టు కొలత 21 ఇంచులని ప్రస్తుతం 27 ఇంచులుగా
చెబుతున్నారు. ఇందుకు లింగంపై అమర్చిన నాగ ప్రతిమను ఉదాహరణగా
చూపుతున్నారు. అంతేగాక ఈ గుట్టపై అంజనేయస్వామి గుడి… భైరవ
ఆలయాలు ఉన్నాయి… ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో మెరిమిడిపేరిట
స్వామివారికి ఆరురోజుల పాటు ఉత్సవాలు జరుగు తగ్గుతాయని భక్తులు… పంచామృత సహస్ర రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, అగ్నిగుండాలు
నిర్వహించుట ఆలయ ప్రత్యేకతలు… ప్రస్తుతం ఈ ఆలయ మహిమల
వల్లెల తోపాటు పట్టణాలు, ఇతర రాష్ట్రాలకుపాకడంతో భక్తులు |
పెద్దసంఖ్యలో విచ్చేస్తు న్నారు…
భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తాం…
నేటి నుండి బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్య అతిథులకు… భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని… దేవాదాయ ఆలయ ఈవో చందం వంశీ, సిద్దుల గుట్ట చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, నర్మెట సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్బయ్య లు తెలిపారు. సిద్దులగుట్ట దేవాలయ ప్రాంగణంలో చలువ పందిర్లు… విద్యుత్ దీపాలతో అలంకరణ…కళ్యాణ మండపం వద్ద విద్యుత్ కాంతులతో అలంకరణ… రాత్రి సమయాలలో మహిళలచే కోలాటాలు… చిన్నారులచే భరతనాట్యాలు… ఉంటాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని… మంచినీటి సౌకర్యం… పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.