పోలింగ్ సామాగ్రి పంపిణీ తీరును పరిశీలించిన కలెక్టర్

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించి..పోలింగ్ సామాగ్రి పంపిణీ తీరును పరిశీలించిన కలెక్టర్…!

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల ఏర్పాట్లు పూర్తి…!!

జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్…!!!

జనగామ, అక్షిత ప్రతినిధి:

జనగాం జిల్లా పరిధిలో వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.పోలింగ్ 27.02.2025 (గురువారం) ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరగనున్న నేపథ్యం లో..బుధవారం (26.02.2025) రోజున ఐ డి ఓ సి, జనగాంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి..పోలింగ్ సిబ్బంది… ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని అందుకొని, వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలివెళ్లారు.

ఈ ప్రక్రియని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్వయం గా పరిశీలించారు.

పోలింగ్ ప్రక్రియపై కలెక్టర్ సూచనలు:

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… “ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు కఠిన చర్యలు తీసుకున్నామన్నారు

12 పోలింగ్ కేంద్రాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయన్నారు.

పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకుని విధులను నిర్వర్తించాలన్నారు.

ఓటింగ్ గోప్యతను ఖచ్చితంగా పాటించాలని” అన్నారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆయన, తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు వంటి అన్ని వసతులు సమర్థంగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలు:

మొత్తం ఓటర్లు: 1,002

సిబ్బంది నియామకం: 17 మంది పీవోస్, 18 మంది ఏపీవోస్, 37 మంది ఓ పీవోస్, 18 మంది మైక్రో అబ్జర్వర్లు…

రూట్ ప్లాన్: ప్రతి మూడు మండలాలకు ఒక రూట్ చొప్పున 4 రూట్లు ఏర్పాటు

సెక్టోరియల్ అధికారులు: 4 మంది నియామకం

సమగ్ర మౌలిక సదుపాయాల ఏర్పాటు: తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, మూత్రశాలలు

సీసీ కెమెరాలు & వెబ్ కాస్టింగ్: అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు

పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక మార్గదర్శకాలు:

పోలింగ్ సామగ్రి సరైన విధంగా అందిందా అనే విషయాన్ని చెక్‌లిస్ట్ ఆధారంగా ధృవీకరించాలి.

బ్యాలెట్ పద్ధతి ప్రకారం పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.

ఓటింగ్ కేంద్రాలకు బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బంది తరలింపునకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు.

పోలింగ్ సామగ్రి తరలింపు సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా సంబంధిత అధికారులను వెంటనే సమాచారం అందించాలి.

జిల్లాలో మొత్తం 12 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్, ఆర్డీవోలు గోపీరాం, వెంకన్న, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీకాంత్, కలెక్టరేట్ ఏఓ మన్సూర్ తదితర అధికారులు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking