*రాజి మార్గమే రాజ మార్గo

సామాన్య ప్రజలకు చేరువలో న్యాయ సేవలు

*రాజి మార్గమే రాజ మార్గము
జిల్లా జడ్జి నిర్మలా గీతాంభ*

వరంగల్, అక్షిత బ్యూరో:

వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం శివరాత్రి పర్వదినం సందర్భంగా కాశిబుగ్గ లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ముందు ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసి, సందర్శకులకు చట్టపరమైన సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ స్టాల్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ” ప్రజలందరూ వివిధ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో ఈ స్టాల్ ను ప్రారంభించమని తెలిపారు. చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, చట్టానికి పేద, ధనిక అనే భేదం ఉండదని ఈ సందర్భంగా తెలియజేశారు.

జాతీయ లోక్యత అంశం పట్ల వివరణ ఇచ్చి, రాజీమార్గం ద్వారా మార్చి 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ లో తమ కేసులను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ శ్రీధర్, జువైనల్ సభ్యుడు మేరుగు సుభాష్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది శ్రవణ్, రాజు నాగరాజు, సింధు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking