డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్
పోలింగ్ సామాగ్రి పంపిణీ తీరు పరిశీలన
కలెక్టర్ తేజస్ నంద్ పవార్
సూర్యాపేట, అక్షిత ప్రతినిధి:
నల్గొండ, ఖమ్మం, వరంగల్ శాసన మండలిఉపాధ్యాయనియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సూర్యాపేట జిల్లా సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజసు.బుధవారంసందర్శించారు. సూర్యాపేటకలెక్టరేట్, సామావేశమందిరంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పీ.ఓ, ఏ.పీ.ఓ, ఓ.పీ.ఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యాయా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. బ్యాలెట్ పద్ధతి ద్వారా పోలింగ్ ప్రక్రియను జరిపించాల్సిన తీరు గురించి, వెంట తీసుకెళ్లాల్సిన బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సామాగ్రి గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు.

ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా,లేదాఅన్నదిజాగ్రత్తగాపరిశీలించుకోవాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఆర్టీసీ బస్సులను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి పీ.ఎస్ లకు తీసుకెళ్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. కాగా, జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాలలో 2664 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కోనున్నారని, గురువారం ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి సిబ్బంది తమకు కేటాయించిన వాహనాలలో నేరుగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుని పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు పీ.ఓ, ఏపీ.ఓ, ఇద్దరు ఓపీఓలతో పాటు అదనపు సిబ్బందిని నియమించామని కలెక్టర్ తెలిపారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న వారు తమఓటుహక్కునువినియోగించుకోవాలని కలెక్టర్ తేజస్ సూచించారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి రాంబాబు , ఆర్డిఓ వేణుమాధవ్, పోలింగ్ సిబ్బంది, మరియు అధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking