శ్రీ సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు
ఖమ్మం /అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి వారిని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని అన్నారు.గత బిఆర్ఎస్ పాలనలో పట్టించుకోక సరైన అభివృద్ధి జరగలేదని ప్రజా పాలన ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలకు చాలా నిధులు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు.నాటి కాకతీయుల స్ఫూర్తితోనే నేడు దేవాలయాలకు రేవంత్ రెడ్డి పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.తీర్థాల ఆలయ అభివృద్ధికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని నాగేశ్వరావు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కళ్ళెం వెంకటరెడ్డి తనగంపాడు మాజీ సర్పంచ్ కేతినేని వేణు పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బాణోతు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.