ఆంజనేయులుని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

ఆంజనేయులుని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్

అక్షిత ప్రతినిధి, డిండి :

డిండి మండలం గొనబోయినపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గున్నమోని ఆంజనేయులు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆదివారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆంజనేయులు ని పరామర్శించి ఆంజనేయులు కి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆంజనేయులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఆయన వెంట డిండి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వరరావు, రాఘవాచారి,మల్లయ్య, శ్రీను,వడ్త్యా బాలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking