అర్ధరాత్రి మద్యం మత్తులో బీఆర్ఎస్ కార్యకర్తల హల్ చల్

అర్ధరాత్రి మద్యం మత్తులో బీఆర్ఎస్ కార్యకర్తల హల్ చల్

కాంగ్రేస్ గ్రామశాఖ అధ్యక్షుడిపై దాడి

●కేతేపల్లి, అక్షిత ప్రతినిధి :

నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలోని కొప్పోలు గ్రామంలో రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది అర్ధ రాత్రి మద్యం మత్తులో హల్చల్ చేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నిత్యం అర్ధరాత్రి మద్యం సేవిస్తూ గ్రామం మధ్యలో ఓ షాప్ ను అడ్డాగా మార్చుకొని ఇండ్ల నివాసాల వద్ద అరాచకాలకు పాల్పడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను టార్గెట్ చేసిన బిఆర్ఎస్ ఆకతాయిలు,అదే గ్రామంలో ఓ కార్యకర్త ఫాంక్షన్ ను హాజరై తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కొప్పోలు గ్రామ శాఖ అధ్యక్షుడు
కొప్పు సైదులు పై అకారణంగా దాడి చేసి గాయపరిచ డమే కాకుండా ముందస్తుగా పథకం ప్రకారంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేసి నానా ఇబ్బందులకు గురిచేస్తూ,
వచ్చే ప్రభుత్వం మాదే అని నీ అంతు చూస్తామని బెదిరిస్తూ అతని ఇంటి చుట్టూ మహేష్ తో పాటు మరికొంతమంది కలిసి కర్రలను,రాడ్లను చేతిలో పట్టుకొని సైదులు ఇంటి చుట్టూ తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దాంతో వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నామని సైదులు సతీమణి బోరున విలపించారు రేపు నా భర్తకు ఏదైనా అపాయం కలిగినచో పూర్తి బాధ్యత వారిదేనని తెలిపారు ఇప్పటికైనా పోలీసు వారు సహకరించి నాకు నా భర్తకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking