యువత ఉపాధికి    రాజీవ్ యువ వికాసం

యువత ఉపాధికి
రాజీవ్ యువ వికాసం

బీసీ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతిశ్రీకాంత్ గౌడ్

హైదరా బాద్, అక్షిత ప్రతినిధి :

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిరుద్యోగ యువతకు వినూత్న పథకాలు ప్రవేశపెట్టాలని చేస్తున్న కృషిలో భాగంగా “రాజీవ్ యువ వికాసం” అనే వినూత్న కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చిందని బిసి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. మంగళవారం నాడు గాంధీ భవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి రాజీవ్ యువ వికాస్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. ఈ పథకం క్రింద నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రుణం మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు అకౌంట్ నెంబర్, పాస్పోర్ట్ ఫోటో మొబైల్ నెంబర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది అని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం యువ వికాసానికి మార్చి 17 నుండి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని అన్నారు. ఏప్రిల్ 6 నుండి 30 వరకు లబ్ధిదారుల ఎంపిక యూనిట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. క్యాటగిరి-1 లో లక్ష వరకు రుణం 80% రాయితీ, క్యాటగిరి రెండులో రెండు లక్షల వరకు సహాయం 70% రాయితీ, మూడవ కేటగిరిలో మూడు లక్షల వరకు సహాయం 60 శాతం రాయితీ కల్పించడం జరుగుతుందని శ్రీకాంత్ అన్నారు. పాలన ప్రక్షాళన పారదర్శకత తమ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులకే పథకాలు ఇవ్వాలని లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ఆరంభించడం జరిగిందని. ప్రభుత్వం ఆదాయం తగ్గిన అప్పులు పెరిగిన ధైర్యంతో ముందడుగు వేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ యువత ఉపాధికి సన్నద్ధమైందని అన్నారు. గత ప్రభుత్వం యువతను పట్టించుకోకపోవడంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు జరిగిందని, అలా అంటే నష్టం జరగకూడదని తమ ప్రభుత్వం 6000 కోట్ల ప్రణాళికతో రాజీవ్ యువ వికాస్ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. 50 వేల నుంచి 4 లక్షల వరకు రాజీవ్ యువ వికాసం రుణాలు అందజేయడం జరుగుతుంది. రాజీవ్ యువ వికాసం పథకం క్రింద 50 వేల నుంచి నాలుగు లక్షల మంజూరు కి దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభమైందని శ్రీకాంత్ అన్నారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉందని అన్నారు. ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అప్లై చేసుకోవచ్చని ఏప్రిల్ 6 నుంచి 30 వరకు లబ్ధిదారుల ఎంపిక యూనిట్ల మందులు ఉంటుందని జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని అన్నారు. నిజమైన నిరుద్యోగులకు ఈ పథకం అందాలనే లక్ష్యంతో ప్రజల పథకంగా దీనిని ముఖ్యమంత్రి పేర్కొన్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యువ వికాస పథకాన్ని ఉపయోగించుకుని యువత ఉపాధి కల్పించుకోవాలని ఈ సందర్భంగా శ్రీకాంత్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking