నేత్రదానంతో ఇతరులకు
కంటి చూపు
*నేత్రదానం అభినందనీయం
*డైమండ్ శ్రీనివాస్
మిర్యాలగూడ మార్చి 19 అక్షిత ప్రతినిధి :
తమ కుటుంబ సభ్యుడు మరణించిన బాధలోనూ నేత్రదానం చేసి ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘటన మిర్యాలగూడ, నల్లగొండలలో జరిగింది.మిర్యాలగూడ పట్టణం రవీంద్రనగర్ కు చెందిన మూడవత్ నాగు(34) బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ప్రాణాలను కోల్పోయారు. మరణాంతరం వారి కుటుంబ సభ్యులను డైమండ్ నేత్రనిధి ఐ బ్యాంకు టెక్నీషియన్ బచ్చలకూర రమేష్ కుటుంబ సభ్యుల అంగీకారంతో నేత్రాలను సేకరించారు. ఐ డైమండ్ నేత్రనిధి చైర్మన్ లయన్ మాశెట్టి శ్రీనివాస్ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి నేత్రదానం గురించి వారికి నచ్చ జెప్పారు. ఇద్దరు అంధులకు చూపునిచ్చే అవకాశం ఉంటుందని చైతన్య పరచడంతో నెత్రాలను తీసి వెంటనే డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంకు హైదరాబాద్ కు పంపించారు. ఈ నెల 18న నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన దుదిమెట్ల లక్ష్మయ్య (65) నేత్రాలను కూడ డైమండ్ ఐ బ్యాంక్ వారు తీశారు.
నేత్రదానం మహాదానమని ముందుకు వచ్చినందుకు కుటుంబ సభ్యులకు డైమండ్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబ సభ్యులు మరణించిన బాధలోనూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సదుద్దేశ్యంతో నేత్రడానానికి ముందుకు రావడం అభినందనీయమని ఆయన అన్నారు.