జానంపేట పీహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
మహబూబ్ నగర్, మార్చి 19 అక్షిత ప్రతినిధి :
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. బుధవారం ఆమె మూసాపేట మండలం జానం పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. ఓ.పి.విభాగంలో ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్ ల వివరాలు తెలుసుకున్నారు. ఓ.పి.లో ఎటువంటి రకాల కేసులు వస్తున్నాయి తెలుసుకున్నారు.

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున
వడ దెబ్బకు తగిన చికిత్స అందించాలని, వేసవిలో జాగ్రత్తలపై రోగులకు అవగాహన కలిగించాలని సూచించారు. ఇన్ పేషంట్ వార్డ్, ల్యాబ్, ఔషధాలను నిలువ ఉంచిన డ్రగ్ స్టోర్, ప్రసూతి తదితర విభాగాలను పరిశీలించారు. వైద్య సేవల కోసం పీ హెచ్ సి కి వచ్చిన రోగులను పలుకరించి, వారికి అందుతున్న వైద్య సేవల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, కాలం చెల్లిన ఔషధాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, వాటి స్థానంలో కొత్త స్టాక్ ను వినియోగించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో డెలివరీల గురించి తెలుసుకున్నారు.మార్చి నెలలో ఇప్పటి వరకు 10 డెలివరీలు చేసినట్లు తెలిపారు.హై రిస్క్ కేసులు ఉన్నాయా తెలుసుకున్నారు. ప్రతి నెల గర్భిణీల జాబితా ప్రకారం వారికి చెకప్ లు వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.మెడికల్ ఆఫీసర్ షబానా తదితరులు ఉన్నారు