అంబులెన్స్ సేవలు ఎనలేనివి
–ఆస్పత్రులకు రోగులకు అనుసందాన కర్తలు
-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయుడు తుమ్మల యుగంధర్
ఖమ్మం /అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరలోని ప్రైవేటు అంబులెన్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఖమ్మంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ లో ఎర్ర బాల గంగాధర్ అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయుడు తుమ్మల యుగంధర్ మాట్లాడారు. అంబులెన్స్ డ్రైవర్లు రాత్రీపగలు తేడా లేకుండా రోగులను ఆస్పత్రులకు చేర్చేందుకు అహర్నిషలు పని చేస్తుంటారని వారి సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఆంబులెన్సులను వేగంగా నడిపినప్పటికీ వారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చుతారని అన్నారు.

ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కంబంపాటి నారాయణ రావు మాట్లాడుతూ ఆస్పత్రులకు రోగులకు అనుసందాన కర్తలుగా అంబులెన్స్ డ్రైవర్లు యజమానులు పనిచేస్తుంటారని అంబులెన్స్ సర్వీస్ లో స్టక్చర్ తో పాటుగా ఒక వీల్ చైన్ కూడా ఉండేలా చూసుకుంటే రోగులకు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. ఐఎంఏ లీగల్ అడ్వౌజర్ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ మాట్లాడుతూ వైద్యులకు, రోగులకు వారధులుగా అంబులెన్స్ డ్రైవర్లు, ఓనర్లు పని చేస్తూ ఉంటారని, కుటుంబాలను పక్కన పెట్టి కూడా రోగులను ఆస్పత్రులకు చేర్పించేందుకు ఓ వారధిలా ఉంటున్నారని అన్నారు. ఐఎంఏ మెంబర్ అనస్తిషియా వైద్యులు కుసుమరాజు రవి మాట్లాడుతూ డ్రైవర్లు తప్పని సరిగా ఇన్సూరెన్సులను కలిగి ఉండాలని సూచించారు. తమ వతుగా తాము కూడా సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బాణోత్ మైదులు మాట్లాడుతూ డ్రైవర్లకు, ఓనర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా చూసుకుంటానని, తన గెలుపు సహకరించిన ప్రతీ ఒక్కరికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షుడిగా బాణోత్ మైదులుతో ఉపాధ్యక్షుడిగా ఏలూరి శ్రీకాంత్ జనరల్ సెక్రటరీగా పొలిశెట్టి మహేష్ కోశాధికారి యలమంచి బాబు జాయిట్ సెక్రటరీ రఫీ గౌరవ అధ్యక్షుడు మంద సతీష్ గౌరవ సలహాదారుడు రాజేష్ లతో సభ అధ్యక్షుడు బాల గంగాధర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బాలగంగాధర్ మాట్లాడుతూ అంబులెన్స్ ఓనర్లు, డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అంబులెన్స్ యూనియన్ కార్యకలాపాలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు స్థలం కేటాయించాలని కోరారు. ఆయా ఆస్పత్రుల యజమానులు కూడా తాము చేస్తున్నా సేవలను గుర్తించి, ఇన్సూరెన్సులతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ మిక్కిలినేని నరేంద్ర, కుక్కల మహేష్ కుక్కల రాజా అప్రద్ రాజేందర్ మల్చూర్ జి.వెంకటేశ్వర్లు డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ టెక్నీషన్ సంఘం అధ్యక్షుడు గాంధీ రాము మురళి శివ సుందర్ సునీల్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.